Myanmar: మసీదుల్లో ప్రార్థన చేస్తూ 700 మంది మృత్యువు.. 2వేలకు పైనే..

దేవుడిని ప్రార్థిస్తూ...ఆ దేవుడి దగ్గరకే వెళ్ళిపోయారు పాపం. మయన్మార్ లో భూకంపం మిగిల్చిన విషాదం ఇది. దాదాపు 700మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగానే చనిపోయారని తెలుస్తోంది. మరోవైపు అక్కడి మృతుల సంఖ్య 2 వేలు దాటింది.

author-image
By Manogna alamuru
New Update
international

Myanmar

మయన్మార్ లో శవాల వెలికితీత ఇంకా సాగుతూనే ఉంది. ఐదు రోజులు గడిచినా ఇంకా మృతకళేబరాలు బయటపడుతూనే ఉన్నాయి. మరణించిన వారి సంఖ్య ఇప్పటికి 2 వేలు దాటిందని చెబుతున్నారు. ఇందులో దాదాపు 700 మంది ప్రార్థనలు చేస్తుండగా చనిపోయరాని చెబుతున్నారు. మయన్మార్ లో దాదాపు 60 మసీదులు కూలిపోవడమో, దెబ్బతినడమో జరిగిందని, వీటిలో చాలావరకు పురాతనమైనవని ముస్లిం సంఘాల ప్రతినిధి తున్‌ క్యీ చెప్పారు. అలాగే అక్కడ బౌద్ధమఠాలు కూడా కప్పకూలిపోయాయి. ఒక మఠంలో 200 మంది బౌద్ధ సన్యాసులు, మరో 50 మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.  మాండలేలో మతపరమైన పరీక్షను రాస్తున్న 270 మందిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా 70 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలినవారి ఆచూకీ గల్లంతయింది. 

Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..

చాలా మంది ఆచూకీ లభించలేదు..

మయన్మార్ భూకంపంలో చాలా మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఒకవైపు ప్రాణాలు పోయి శవాలు బయటపడుతున్నాయి. మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా 3, 400 కు చేరుకుంది. వీరందరూ శిథిలాలు మీద పడి తీవ్రంగా గాయపడిన వారే. ఇంకోవైపు దాదాపు 300మంది దాకా ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. మయన్మార్ ప్రభుత్వం అంచనా వేసినదానికంటే ఎక్కువే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అంటున్నారు.  మనుషుల గురించి వెతుకులాట అయ్యాక మయన్మార్ మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాండలే నగరాన్ని క్లియర్ చేయడానికే చాలా రోజులు పట్టేట్టు వుందని అధికారులు చెబుతున్నారు.  ప్రపంచ దేశాల నుంచి వెళ్ళిన సహాయక బృందాలు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వెళ్ళిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు వెలికి తీసింది. మొత్తం 13 భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 

 today-latest-news-in-telugu | earth-quake | death | toll 

Also Read: రేపటి నుంచే ట్రంప్ ప్రతీకార సుంకాల దండయాత్ర

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు