Space X: మస్క్ స్పెస్ ఎక్స్ రాకెట్ బూస్టర్ సూపర్ సక్సెస్..గల్ఫ్ ఆఫ్ మెక్సికో లో ల్యాండ్

ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ అంగరక గ్రహం మీదకు పంపించబోయే స్టార్ సిప్ 11 టెస్ట్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం అయింది. ఇది నకిలీ ఉపగ్రహాలను విడుదల చేస్తూ సగం దూరం ప్రయాణించింది. 

New Update
space x

Space x, Star Ship

ఎలాన్ మస్క్ అంతరిక్ష పరిశోధనా సంస్థ సేసప్ ఎక్స్. నాసాతో కలిసి పని చేసే ఈ సంస్థ అంగారకుడి మీదకు మనుషులను తీసుకెళ్ళే ప్రయోగాల్లో నిమగ్నమైంది. ఇంతకు ముందు దీనికి సంబంధించిన పలు ప్రయోగాలు విఫలం అయ్యాయి. అయితే తాజాగా స్సేప్ ఎక్స్ ప్రయోగించిన భారీ స్టార్ షిప్ రాకెట్ టెస్ట్ ఫ్లైట్ విజయవంతం అయింది. ఇది నకిలీ ఉపగ్రహాలను విడుదల చేస్తూ సగం దూరం ప్రయాణించింది. టెక్సాస్ లోని నాసా స్సేప్ సెంటర్ నుంచి దీనిని ప్రయోగించారు. రాకెట్ గాల్లోకి ఎగరడం, ఉపగ్రమాలను విడుదల చేయడం అయిన తర్వాత రాకెట్ నుంచి బూస్టర్ దూరంగా వెళ్ళింది. ఆ తరువాత అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలోకి నియంత్రిత ప్రవేశం చేసింది. అయితే అంతకు ముందు దేని కోసం అయితే టెస్ట్ ఫ్లైట్ ను ప్రయోగించారో అది సక్సెస్ అయింది. 

దగ్గరుండి పర్యవేక్షించిన ఎలాన్ మస్క్..

టెస్ట్ ఫ్లైట్ విజయంపై స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు హర్షం ప్రకటించారు. దీని సీఈవో ఎలాన్ మస్క్ కూడా రాకెట్ ప్రయోగాన్ని వీక్షించారు. కంట్రోల్ రూమ్ నుంచి కాకుండా రాకెట్ ప్రయోగించిన ప్రాంతం నుంచి ఆయన దీన్ని చూశారు. ప్రస్తుతం ప్రయోగించిన రాకెట్ అంగారక గ్రహం మీదకు ప్రజలను పంపడానికి ఉపయోగపడుతుందని మస్క్ తెలిపారు. ఇదొక పునర్వినియోగ వాహనమని చెప్పారు. చంద్ర కక్ష్య నుంచి ఉపరితలం వరకు వెళ్ళి తిరిగి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని వివరించారు. 

దీనికి కన్నా ముందు ప్రయోగించిన టెస్ట్ ఫ్లైట్ దారి మధ్యలోనే పేలిపోయింది. దీంతో ఈసారి మరింత జాగ్రత్తగా రూపొందించి ప్రయోగించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. . ప్రయోగ స్థలంలో భవిష్యత్తులో తిరిగి ల్యాండింగ్‌ల కోసం సాధనగా అంతరిక్ష నౌక హిందూ మహాసముద్రం మీదుగా ప్రవేశించేటప్పుడు స్పేస్‌ఎక్స్ వరుస పరీక్షలను నిర్వహించిందని చెప్పారు. స్టార్‌షిప్ స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌లను అనుకరించే ఎనిమిది నకిలీ ఉపగ్రహాలను మోసుకెళ్లిందని..మెక్సికన్ సరిహద్దుకు సమీపంలోని స్టార్‌బేస్ నుండి బయలుదేరిన ఈ మొత్తం విమానం గంటకు పైగా కొనసాగిందని తెలిపారు. చంద్రుని దక్సిణ ధ్రువంపై అమెరికన్లను దింపడానికి మరో ప్రధాన అడుగు పడిందని నాసా తాత్కాలిక నిర్వాహకుడు సీన్ డఫీ అన్నారు. 

Also Read: Mrs Universe: మిసెస్ యూనివర్శ్ గా భారత మహిళ షెర్రీ సింగ్..48 ఏళ్ళల్లో మొదటిసారి..

Advertisment
తాజా కథనాలు