Mrs Universe: మిసెస్ యూనివర్శ్ గా భారత మహిళ షెర్రీ సింగ్..48 ఏళ్ళల్లో మొదటిసారి..

భారత మహిళ మొట్టమొదటిసారిగా మిసెస్ యూనివర్శ్ టైటిల్ గెలుచుకున్నారు. 48 చరిత్రలో భారతీయురాలు కిరీటం ధరించడం ఇదే మొదటిసారి. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. 

New Update
Mrs Universe

ఇండియాకు మిస్ యూనివర్స్ లు, మిస్ వర్ల్డ్ లు బాగానే వచ్చాయి. ప్రపంచ అందగత్తెలతో మనవారు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. అయితే మిస్ అందగత్తెల పోటీలానే మిసెస్ పోటీలు కూడా జరుగుతాయి. 48 ఏళ్ళుగా వీటిని నిర్వహిస్తున్నారు. పెళ్ళైన, తల్లులు అయిన మహిళలకు ఈ పోటీ నిర్వహిస్తారు. ఇందులో మొదట్టమొదటిసారిగా ఒక భారతీయులు టైటిల్ గెలుచుకున్నారు. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీల్లో భారతీయురాలు షెర్రీ సింగ్ ఈ ఘనత సాధించారు. 48 ఏళ్లుగా సాగుతున్న ఈ పోటీలో ఈ మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా షెర్రీ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈసారి పోటీల్లో మొత్తం 120మంది దేశాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. 

తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళి, ఒక బాబు..

మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న షెర్రీసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. మిసెస్ యూనివర్స్ 2025గా ఆమె పేరు ప్రకటించినప్పుడు కన్నీళ్ళను ఆపుకోలేకపోయారు. ఈమెకు తొమ్మిదేళ్ళ క్రితం పెళ్ళయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. షెర్రీ సింగ్ తన విజయాన్ని అందరు మహిళలకూ అంకితమిచ్చారు. పరిస్థితులు దాటుకుని, కలలు కనడానికి సాహసం చేసే ప్రతీ మహిళకు ఈ విజయం అంకితమని ఆమె చెప్పారు. ఆత్మవిశ్వాసం, బలం, దయ అనేవి నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని తాను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నానని షెర్రీ సింగ్ అన్నారు. ఈమె ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్. ఫ్యాషన్ , ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను ఎక్కువగా పెడుతుంటారు. అలాగే ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన అంశాలను తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటారు. శ్రీకృష్ణుని భక్తురాలిగా.. ఆమె తరచూ తన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి వివరాలు చెబుతుంటారు. 

మనీలాలో జరిగిన మిసెస్ యూనివర్శ్ పటీల్లో విజేతను కేవలం అందం ద్వారానే కాకుండా..తెలివితేటలు, కరుణ, సామాజిక బాధ్యతలకు కూడా జ్యూరీ సమాన ప్రాధాన్యం ఇచ్చింది. షెర్రీ సింగ్ చాలా ఏళ్ళుగా పేద బాలికల విద్యకు మద్దతునిచ్చే సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. అదే సమయంలో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రేయస్సు కోసం నిత్యం కృషి చేస్తూన్నారు. వీటిని కూడా జ్యూరీ పరిగణనలోకి తీసుకుంది. షెర్రీ సింగ్ ఫ్యాషన్ టెక్నాలజీలో కూడా మాస్టర్స్ డిగ్రీ చేశారు. అంతేకాదు ఈమె జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. తాము ఎల్లప్పుడూ షెర్రీ సింగ్ సామర్థ్యం పట్ల విశ్వాసం ఉంచామని.. ఆమె సాధించిన చారిత్రక విజయం భారత్‌కు గర్వకారణమని.షెర్రీ మెంటర్, నేషనల్ డైరెక్టర్ ఊర్మిమాలా బోరువా అన్నారు. దేశానికి గౌరవంగా, ఆత్మవిశ్వాసంతో ప్రాతినిధ్యం వహించాలనుకునే ప్రతీ మహిళకు షెర్రీ సింగ్ ఒక బెంచ్ మార్క్ అని చెప్పారు. 

Also Read: Hydropower Project : చైనాకు పోటీగా బ్రహ్మపుత్రపై భారత్ మాస్టర్ ప్లాన్..6.4 లక్షల కోట్లతో  భారీ ప్రాజెక్ట్..!

Advertisment
తాజా కథనాలు