Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..హత్యాయత్నం

కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తున్న మిగ్యుల్ ఉరిబ్ టర్బేపై హత్యాయత్నం జరిగింది. ఒక ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. మిగ్యుల్ తలకు లేదా మెడకు బుల్లెట్ తగిలి ఉండవచ్చని తెలుస్తోంది.

New Update
Colombia

Colombian presidential candidate Miguel Uribe

ఇంతకు ముందు అమెరికా, ఇప్పుడు కొలంబియా..ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపపై వరుసగా హత్యాయత్నానికి పాల్పడుతున్నారు. కొలంబియాలో జరిగిన సంఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. శనివారం కొలంబియాలోని బొగోటా పార్క్ లో ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రతిపక్ష అభ్యర్థి మిగ్యుల్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. బొగోటా మేయర్‌ కార్లోస్‌ గాలన్‌ ఈ విషయన్ని ధ్రువీకరించారు. ఈ ఘటనలో మిగ్యుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన వెనుక నుంచి దుండుగుడు కాల్పులు చేశాడు. అధికారులు వెంటనే మిగ్యుల్ ను ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.  మిగ్యుల్ తలకు లేదా మెడకు బుల్లెట్ తగిలి ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. 

కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి..

వచ్చే ఏడాది కొలంబియాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మిగ్యుల్ కన్జర్వేటివ్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థి. ఆయనపై దాడిని  ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక రాజకీయ నాయకుడిపై జరిగిన దాడి కాదని, దేశంలోని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై జరిగిన దాడి అని వ్యాఖ్యానించింది. మరోవైపు కొలంబియా ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్లో కూడా తీవ్రంగా ఖండించారు. మిగ్యుల్ త్వరగా కోలుకోవాలని కోరారు. 

Also Read: Manipur: మణిపూర్ లో మరోసారి టెన్షన్స్..ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్

Advertisment
తాజా కథనాలు