Mojtaba: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కొడుకు

ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్‌ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.

New Update
Mojtaba, Son Of Ayatollah Ali Khamenei, Elected Iran's New Supreme Leader

Mojtaba, Son Of Ayatollah Ali Khamenei, Elected Iran's New Supreme Leader

ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్‌ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. మొజ్తాబాను ఎన్నుకోవాలని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC) మత పెద్దలను ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీల పాత్ర పోషించారు. ఈయనకు IRGCతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

మొజ్తాబా ఖమేనీ ఎవరు ? 

మొజ్తాబా ఖమేనీ (56).. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు. ఈయన 1959లో ఇరాన్‌లోని మషాద్‌ నగరంలో జన్మించారు. ఈయన దేశ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తెర వెనుక ఉండే చక్రం తిప్పేవారు. వాస్తవానికి అధికారికంగా మొజ్తాబాకు ప్రభుత్వంలో ఎలాంటి పెద్ద పదవి లేదు. కానీ తండ్రి ఖమేనీ కార్యకలపాల్లో ఈయన కీలకంగా వ్యవహరిస్తారు. ఇరాన్ నిఘా సంస్థలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC)పై గట్టి పట్టు ఉంది. 

Also Read: ఇండియాకు రష్యా బంపరాఫర్.. కష్ట సమయంలో నేనున్నాని పుతిన్ భరోసా

మొజ్తాబా.. కోమ్‌ నగరంలోని ఉన్నతస్థాయి ఇస్లామిక్ విద్యను అభ్యసించారు. 2005, 2009 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో మహమూద్ అహ్మదీనెజాద్ గెలుపు వెనుక మొజ్తాబా హస్తం ఉందనే ప్రచారం ఉంది. తండ్రి వారసుడిగా సుప్రీం లీడర్ హోదాను పొందడం కోసం మొజ్తాబా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్లు సమాచారం. తండ్రి మరణం తర్వాత మొజ్తాబాను సుప్రీం లీడర్‌గా ఎన్నుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) మత పెద్దలను ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 

ఇదిలాఉండగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడిల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు తన కూతురు, అల్లుడు, మనవరాలు కూడా ఈ దాడుల్లో మరణించారు. అనంతరం ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేపట్టింది. దీంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Also Read: దుబాయ్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అమెరికా కాన్సులేట్‌ వద్ద డ్రోన్ దాడి

Advertisment
తాజా కథనాలు