Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో మితిమీరుతున్న ఆంక్షలు..మోడ్రన్ హెయిర్ కట్ చేసినా..

ఆఫ్ఘనిస్థాన్ లో ఆంక్షలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఇన్నాళ్ళు అక్కడ మహిళలు మాత్రమే బాధితులు అనేుకుంటున్నారు అందరూ కానీ కాదని ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఆఫ్ఘనిస్థాన్లో పురుషులు మోడ్రన్ హెయిర్ కట్ చేసుకున్నా తప్పేనట.

New Update
afghan

afghan

ప్రపంచం అంతా ఒకలా ఉంటే ఆప్ఘనిస్తాన్ మాత్రం మరోలా ఉంటుంది. ఆ దేశం తాలిబాన్ల చేతిలోకి వెళ్ళి దగ్గర నుంచి దాని రూపురేఖలు, అక్కడ ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయాయి. విపరీతమైన కట్టుబాట్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆఫ్ఘన్లు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్థాన్ లో కేవలం మహిళలు మాత్రమే బాధితులు కాదని తెలుస్తోంది. అక్కడ పురుషుల మీద కూడా చాలా ఆంక్షలే ఉన్నాయని చెబుతోంది. ఆచారాలను నియంత్రించే మంత్రిత్వ శాఖ ఒకటి ఉంది అక్కడి. దాని వలన కులవృత్తుల వారు కూడా నష్టపోతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఆ దేశంలో మగవారు కటింగ్ చేయించుకుంటే కూడా తప్పేనట. ఈ కారణంగా కత్తిరించుకున్న పురుషులను, వారికి క్షవరం చేసిన క్షురకులను కూడా నైతిక పోలీసులు అరెస్టు చేస్తున్నారు.

ఆ దేశంలో ప్రతీ దానికి రూల్..

ఆఫ్ఘనిస్థాన్ లో ప్రతీదానికీ రూల్ ఉంటుంది అని చెబుతోంది ఐక్యరాజ్య సమితి నివేదిక. బస్సుల, రైళ్ళల్లో ఎలా ఉండాలి, క్షవరం, సంగీతం, ఫెస్టివల్స్ ఇలా అన్నింటికీ సంబంధించి రూల్స్ ను పెట్టింది. దానికి సంబంధించిన నియమావళిని గత ఆగస్టులో కూడా విడుదల చేసింది అక్కడ ప్రభుత్వం. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపకూడదనీ, బిగ్గరగా మాట్లాడకూడదని ఆదేశించింది. దీనిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం 3,300 మంది ఇన్‌స్పెక్టర్లను నియమించింది. ఇప్పటికే తమ రూల్స్ ను అతిక్రమించారంటూ చాలా మందిని అరెస్ట్ చేసింది అక్కడి రక్షణశాఖ. ఇందులో సగం మంది సరిగ్గా జుట్టు కత్తిరించుకోలేని కారణంగా అరెస్ట్ అయిన వారు, బార్బర్లే ఉన్నారు. అంతేకాదు రంజాన్‌ మాసంలో క్రమం తప్పకుండా నమాజ్‌ చేయని పురుషులనూ పాలకులు నిర్బంధించారు. ఇక మహిళలను విద్య, ఉద్యోగాల్లోకి వెళ్ళనివ్వకపోవడంతో  అఫ్గానిస్థాన్‌ ఏడాదికి 140 కోట్ల డాలర్లు నష్టపోతుందని ఐరాస తెలిపింది. 

today-latest-news-in-telugu | afghanistan | un | hair-cut

Also Read: Kangana Ranuat: తన ఇంటి కరెంట్ బిల్లుపై ఎంపీ కంగనా రచ్చ..క్లారిఫై చేసిన విద్యుత్ శాఖ

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు