/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t132533-2026-02-04-13-26-26.jpg)
Heavy snowfall in japan
Deadly Snowfall : జపాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ హిమపాతం నిండిపోయింది. పలు ప్రాంతాలను హిమపాతం ముంచెత్తింది. గత రెండు వారాలుగా ఉత్తర జపాన్‌లో విపరీతంగా మంచు కురుస్తోంది. ఎడతెరపి లేకుండా
కురుస్తున్న భారీ మంచు కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సుమారు 300 మందికి పైగా గాయాలపాలయ్యారని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లోనైతే ఏకంగా 72 అంగుళాల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. అతిశీతల వాతావరణం కారణంగా చలి తీవ్రత పెరిగి గుండెపోటు మరణాలు అధికసంఖ్యలో నమోదవుతున్నాయన్నాయని తెలిపారు.
🚨RECORD SNOWFALL KILLS 30 IN JAPAN#Japan has deployed troops to northern regions as record-breaking Arctic snowfall causes widespread fatalities & traps residents#Aomori : up to 183 cm (40-year record)
— GlobeUpdate (@Globupdate) February 3, 2026
Toll since Jan 20: 30 dead, 290 injured
Hard-hit areas: #Niigata & #Akitapic.twitter.com/diBQ4LfiQ1
/filters:format(webp)/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t132544-2026-02-04-13-26-52.jpg)
ఈ విషయమై జపాన్ ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి మాట్లాడుతూ.. భారీగా మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతుండడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంచును తొలగించడానికి టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించామన్నారు. ఇంత అధికంగా మంచు కురవడం గత 40 ఏళ్లలో ఇదే మొదటిసారని.. రానున్న రోజుల్లో హిమపాతం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Follow Us