Maldives : ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు వెళ్లి అక్కడి సుందర దృశ్యాలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు ప్రధాని మోదీని అగౌరవపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
Also Read: 3 తుపాన్ల ముప్పు.. ఏపీలో మరో మూడు రోజుల్లో భారీ వర్షాలు!
దీంతో సోషల్ మీడియా వేదికగా ‘బాయ్‌కాట్ మాల్దీవుల’ ఉద్యమం జరగడంతో భారతీయ పర్యాటకులు అక్కడికి వెళ్లడం మానుకున్నారు. ఫలితంగా మాల్దీవులకు కీలకమైన పర్యాటక రంగం కుదేలయ్యింది. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు స్వయంగా రంగంలోకి దిగారు.
Also Read: దుర్గామాతపై స్వయంగా పాట రాసిన మోదీ.. వైరల్ అవుతోన్న వీడియో!
5 రోజుల భారత పర్యటన కోసం నిన్న (ఆదివారం) ఢిల్లీ చేరుకున్న మహ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ పర్యాటకులు తిరిగి మాల్దీవులు రావాలని కోరారు. ‘‘భారతీయులు సానుకూల సహకారాన్ని అందిస్తారు. భారతీయ పర్యాటకులకు తిరిగి స్వాగతం’’ అని అభ్యర్థించారు. భారత భద్రతను దెబ్బతీసేలా మాల్దీవులు వ్యవహరించబోదని, భారత్ తమకు విలువైన భాగస్వామి, మిత్ర దేశమని ముయిజ్జు అన్నారు.
Also Read: ప్రియుడి కోసం 13 మంది కుటుంబ సభ్యులను చంపేసిన బాలిక!
ఒక దేశంపై అతిగా ఆధారపడటం తగ్గించడం చాలా అవసరమని ఆయన చెప్పారు. అయితే తమ విధానాలను కొనసాగిస్తూనే భారతదేశ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించమని ఆయన అన్నారు.
Also Read: షాకింగ్.. శబరిమల ప్రసాదంలో ఏముందంటే?