/rtv/media/media_files/2025/11/25/social-media-2025-11-25-10-51-25.jpg)
సోషల్ మీడియా..ఇది మంచిదా, చెడ్డదా అంటే చెప్పడం కష్టమే. ఇది రెండువైపులా పదును ఉన్న కత్తిలాంటిది. సోషల్ మీడియా ఎంత మంచి చేస్తుందో..అంత కన్నా ఎక్కువే చెడ్డ చేయగలదు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో సషల్ మీడియా వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ుగ్రవాద కార్యకలాపాలు సైతం సాగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చును. దీన్న ిజనాలు ఎంత చెడ్డగా వాడతున్నారో. అతి సర్వత్ర వర్జయేత్ అని ఒక సామెత. అంటే అతిగా వాడినా, చేసినా కూడా ఎంత మంచిది అయినా చెడుగానే మారిపోతుంది. ఇప్పుడు సోసల్ మీడియా పరిస్థితి కూడా అలానే ఉంది. దీని మితి మీరిన ఉపయోగం వల్లన తమ నూరేళ్ల జీవితాన్ని చెడు వైపు తీసుకెళ్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీనిపై నియంత్రణ అవసరమని అంటున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు చాలా దేశాలు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు.. చిన్న పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్లు ఇవ్వకుండా నిషేధం విధిస్తున్నాయి.
16 ఏళ్ళలోపు పిల్లలకు బ్యాన్..
ఆస్ట్రేలియా, సింగపూర్ తో పాటూ ఇప్పుడు తాజాగా మలేసియా కూడా 16 ఏళ్ళలోపు పిల్లలకు సఓసల్ మీడియా బ్యాన్ ను ప్రకటించింది. 2026 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధం విధించాలని మలేషియా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలు, లైంగిక వేధింపుల వంటి ఆన్‌లైన్ హాని నుంచి యువతను రక్షించడం ప్రధాన లక్ష్యమని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాలు ఇప్పటికే అమలు చేస్తున్న విధానాలను మలేషియా అధ్యయనం చేస్తోంది. ఇక వారి వయస్సును ధృవీకరించేందుకు ఐడీ కార్డులు, పాస్‌పోర్ట్‌ల ద్వారా ఎలక్ట్రానిక్ తనిఖీలను ఉపయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ఆన్ లైన్ దాడుల నుంచి యువతను రక్షించేందుకే తాము ఈ చర్యలు తీసుకుంటున్నామని మలేసియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ చెప్పారు. ఆన్‌లైన్ ప్రపంచం వేగంగా, విస్తృతంగా, చౌకగా ఉండటమే కాకుండా.. పిల్లలు, వారి కుటుంబాలకు సురక్షితంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి.. నియంత్రణ సంస్థలు, తల్లిదండ్రులు అందరూ తమ పాత్ర పోషించాలని ఆయన కోరారు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది.
లాభాల కన్నా నష్టాలే ఎక్కువ..
మలేసియా చేపట్టిన చర్యల తరువాత మిగతా దేవాలు కూడా దీనిపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అమెరికా, భారత్ వంటి దేశాలు కూడా పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని నిపుణులు చెబుతున్నారు. దీని వలన పిల్లలు, యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని..వారిపై చెడు ప్రభావం చాలా ఉంటుందని అంటున్నారు. 8-12 ఏళ్ల పిల్లలు కంటెంట్ నాణ్యతను గుర్తించలేకపోవడంతో అనుచితమైన ఫోటోలు, వైరల్ చాలెంజెస్, సైబర్ బుల్లింగ్‌కు గురవుతారు. ఇది ఆత్మహత్యా ఆలోచనలు, సార్కాజం, ADHD వంటి సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో 2021 NCPCR స్టడీ ప్రకారం, 13 ఏళ్లు పూర్తి కాకముందే 37% 10-ఏళ్ల పిల్లలు ఫేస్‌బుక్‌లో, 24% ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు. అధిక ఉపయోగం వల్ల సెల్ఫ్-ఈస్టీమ్ తగ్గి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. 2023 గూగుల్ రిపోర్ట్ ప్రకారం, భారత పిల్లల్లో 45% మంది సైబర్ బుల్లింగ్ ఎదుర్కొన్నారు, దీనివల్ల డిప్రెషన్ పెరిగింది. నిద్రలేమి, మతిమరుపు వంటి ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయని అధ్యయనాల్లో తేలింది.
Follow Us