/rtv/media/media_files/2026/02/03/gandhi-2026-02-03-15-06-17.jpg)
ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ(Mahatama Gandhi) కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగానే కాకుండా భారతీయ సమాజంలో కూడా కలకలం రేపుతోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read : ఇండియాకు ట్రంప్ గుడ్‌న్యూస్.. భారీగా టారిఫ్‌లు తగ్గింపు
గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి
స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. జనవరి 12వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 12:50 గంటల సమయంలో) ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారు. వారు చాలా ప్లాన్ ప్రకారం.. మెటల్ కట్ చేసే 'యాంగిల్ గ్రైండర్' మిషన్‌తో విగ్రహాన్ని పాదాల దగ్గర కట్ చేసి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ ద్వారా తెలుస్తోంది.
ఆస్ట్రేలియాకు బహుమతిగా
ఈ విగ్రహం మామూలుది కాదు. భారత ప్రభుత్వం (ICCR) తరపున ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చినది. 2021లో అప్పటి ఆస్ట్రేలియా(australia) ప్రధాని స్కాట్ మోరిసన్ దీనిని ఎంతో ఘనంగా ఆవిష్కరించారు. అయితే ఈ విగ్రహం మీద దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో 2021లో విగ్రహాన్ని ప్రతిష్టించిన కేవలం 24 గంటల్లోనే, కొందరు దుండగులు దీనిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ చర్యను రెండు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇప్పుడు ఏకంగా విగ్రహాన్నే ఎత్తుకెళ్లడంతో దీని వెనుక ఏదైనా విద్వేషపూరిత కుట్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులు ఈ కాంస్య విగ్రహాన్ని ముక్కలుగా చేసి స్క్రాప్ వ్యాపారులకు అమ్మే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, ఎవరైనా అనుమానాస్పదంగా భారీ కాంస్య ముక్కలను అమ్మడానికి వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విక్టోరియా పోలీసులు హెచ్చరించారు.
Also Read : వీర మరణం పొందిన ఇద్దరు బలూచ్ మహిళలు .. వణికిపోతున్న పాకిస్థాన్
కఠినంగా శిక్షించాలని
శాంతిని బోధించిన మహాత్ముడి విగ్రహాన్ని ఇలా ముక్కలు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను కలచివేస్తోంది. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రవాస భారతీయులు డిమాండ్ చేస్తున్నారు.
Follow Us