LUKOIL: ఆస్తులు అమ్మకుంటున్న రష్యా చమురు సంస్థలు..ట్రంప్ ఆంక్షల ఎఫెక్ట్

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపించేందుకు రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇందులో ఒకటైన లుక్ ఆయిల్ కీలక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయంగా ఉన్న తమ ఆస్తులను అమ్ముకునే పనిలో పడింది. 

New Update
luk oil

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాలుగేళ్ళుగా జరుగుతోంది. దీనిని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా రకాలుగా ప్రయత్నించారు. ఎవరెంత చెప్పినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట వినడం లేదు. దీంతో ట్రంప్ రష్యాపై చర్యలను మొదలుపెట్టారు. పుతిన్ ను దారిలోకి తెచ్చుకునేందుకు చర్యలను చేపట్టారు. ఇందులో భాగంగా రష్యాకు సంబంధించిన రెండు చమురు సంస్థలపై ఆంక్షలను విధించారు. దాని ద్వారా రష్యా యుద్ధం చేయడానికి అవసరమయ్యే నిధులు తగ్గుతాయని ట్రంప్ భావించారు. అయితే ఈ ఆంక్షల మూలంగా ఇప్పుడు ఆ రెండు ఆయిల్ కంపెనీలు కష్టాలు ఎదుర్కుంటున్నాయని తెలుస్తోంది. 

రష్యా బయట ఆస్తుల విక్రయం..

ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యన్ లుక్ ఆయిల్ సంస్థ కీలక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయంగా ఉన్న సంస్థ ఆస్తులను విక్రయించే పనిలో పడింది. దీనికి సంబంధించి కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 21లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లుక్ ఆయిల్ భావిస్తోంది. అలా కాని పక్షంలో అమెరికాను మరి కొంత సమయం అడిగే ఆలోచనలో ఉందని చెబుతున్నారు.రష్యాకు చెందిన లుక్‌ఆయిల్‌ సంస్థకు 11 దేశాల్లో చమురు, గ్యాస్‌ ప్రాజెక్టుల్లో వాటాలు ఉన్నాయి. బల్గేరియా, రొమేనియాలో చమురు శుద్ధి కర్మాగారాలు ఉండడంతోపాటు నెదర్లాండ్స్‌లోని రిఫైనరీలో 45శాతం వాటా ఉంది. ఇవి కాకుండా చాలా దేశాల్లో గ్యాస్ స్టేషన్లు, వాటిల్లో భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. ట్రంప్ ఆంక్షలు మూలంగా వీటన్నింటిలో వ్యాపారం చేయడం ఆ సంస్థలకు కష్టంగా మారింది. మరో ఆయిల్ కంపెనీ రోస్ట్ నెస్ట్ కూడా ఇలాంటి కష్టాలనే ఎదుర్కోంటోందని తెలుస్తోంది. 

ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయడమే లక్ష్యంగా..


రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలపై విధించిన ఆంక్షలతో మాస్కో దిగి వస్తుందని తాను భావిస్తున్నానని ట్రంప్ అన్నారు. దీని వలన ఆదేశానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని..దాని నుంచి తప్పించుకోవడానికి అయినా ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపేస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. యుద్ధాన్ని ముగించడానికి ఇదే కరెక్ట్ సమయమన్నారు. వార్‌ను ముగించడంలో రష్యాకు నిబద్ధత లేనందువల్లనే ఈ నిర్ణయం తీసుకున్నామని OFAC తెలిపింది. చమురు కంపెనీలపై ఆంక్షల ద్వారా యుద్ధానికి సేకరించే ఆదాయానికి గండిపడుతుంది. దీని వలన క్రెమ్లిన్ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పింది. ఈ ఆంక్సలను తొలగించాలంటే శాశ్వత శాంతి కోసం రష్యా చర్చలు రపడానికి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. యుద్ధాన్ని ముగించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విస్తృత దౌత్య ప్రయత్నంలో ఈ ఆంక్షలు భాగమని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చెప్పారు. రష్యా తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకునే సామర్థ్యాన్ని దిగజార్చడంతో పాటూ దాని ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడానికే చమురు కంపెనీలపై ఆంక్షలు రూపొందించబడ్డాయని బెసెంట్ తెలిపారు.

Also Read: BIG BREAKING: రియో డి జనీరోలో యాంటీ గ్యాంగ్స్ పై దాడి..64 మంది మృతి

Advertisment
తాజా కథనాలు