/rtv/media/media_files/2025/04/29/b7gY1YAXD830k6tcDaAP.jpg)
Mark Carney
కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి గెలిచింది. నూతన ప్రధానిగా మార్క్ కార్నీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని మోదీ కూడా ఎక్స్‌లో మార్క్ కార్నీకి అభినందనలు తెలిపారు. భారత్, కెనడా సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. కనడా పార్లమెంటులో మొత్తం 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 172 మెజార్టీ సీట్లు అవసరం. కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలివ్రా ఓటమిని అంగీకరించారు. లిబరల్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
Congratulations @MarkJCarney on your election as the Prime Minister of Canada and to the Liberal Party on their victory. India and Canada are bound by shared democratic values, a steadfast commitment to the rule of law, and vibrant people-to-people ties. I look forward to working…
— Narendra Modi (@narendramodi) April 29, 2025
Also Read: భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. స్పాట్‌లో 200 మంది టెర్రరిస్టులు!
మరోవైపు దేశ ప్రజలనుద్దేశించి తాజాగా మార్క్ ప్రసంగం చేశారు. ప్రజల మధ్య విభేదాలు తీసుకొచ్చి, విచ్ఛిన్నం చేసి కెనడాను దక్కించుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైనా కెనడాను స్వాధీనం చేసుకోవాలని అమెరికా సుంకాలు, విలీనానికి సంబంధించి బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కెనడా ప్రజలు ఐక్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.
Thank you, Canada.
— Mark Carney (@MarkJCarney) April 29, 2025
Our strength lies in our resolve to work together. United, we will build Canada strong. pic.twitter.com/uN6h4LUAEP
ఇటీవల ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ వ్యవహారంలో అమెరికాపై తాము గెలుస్తామని ఇటీవల మార్క్ కార్నీ ప్రజలకు హామీ ఇచ్చారు. '' అమెరికా మనకు చేస్తున్న ద్రోహాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ఎన్నో ఏళ్లుగా కెనడా పాటిస్తున్న ఐక్యత, అభివృదఅధి, స్థితిస్థాపకత వంటి విలువలను నేను ముందుకు తీసుకెళ్తాను. మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదట కొన్ని నెలలు సవాలు ఉండే అవకాశం ఉంటుంది. అయినాకూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను.
Also Read: యుద్ధానికి సిద్ధం !.. 40 లక్షల రిటైర్ట్ సైనికులను పిలిస్తున్న పాక్ ఆర్మీ
కెనడా గతంలో కంటే ఇప్పడు బలంగా పుంజుకుంది. ఎన్నికల్లో మాకు గట్టి పోటీ ఇచ్చిన విపక్ష నేత పోయిలివ్రేను కార్నీకి అభినందనలు. దేశ అభివృద్ధి విషయంలో మేమందరం ఒకేలా ఆలోచిస్తామని'' మార్క్ కార్నీ అన్నారు. ఇదిలాఉండగా.. కెనడాను అమెరికాలో విలీనం చేయాలని ఇప్పటికే చాలాసార్లు ట్రంప్ బెదిరించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో మార్క్ కార్నీ మరోసారి ట్రంప్ టారిఫ్‌ల ప్రస్తావనను తీసుకొచ్చారు. అమెరికాపై టారిఫ్ వార్‌లో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇక కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలిపితే ఇప్పటిదాకా విధించిన సుంకాలు తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అంతేకాదు అమెరికాతో ఎలాంటి సరిహద్దులు లేకుండా ప్రజలకు ఫ్రీగా ప్రవేశం కల్పిస్తామన్నారు. తమ ప్రతిపాదనకు ఒప్పుకోకుండే ప్రతీ ఏడాది ఆ దేశానికి ఇస్తున్న వందల బిలియన్ డాలర్ల సబ్సిడీని కూడా నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే తాజాగా మరోసారి లిబరల్ పార్టీ కెనడాలో అధికారంలోకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మార్క్ కార్నీ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.
telugu-news | rtv-news