Pak-Trump: ట్రంప్ భజన..యూఎన్ లో మరోసారి నోబెల్ పీస్ బహుమతికి నామినేట్ చేసిన షెహబాజ్

భారత్ తో వాణిజ్య ఉద్రిక్తత వేళ..పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది పాకిస్తాన్. ఇందులో భాగంగా ఈరోజు ఏకంగా పాక్ పీఎం యూఎన్ లో ఆయనను మరోసారి నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. 

New Update
pak pm

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పోక్స్ పర్శన్ గా మారారు. భారత్ తో విభేదాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్న పాక్..ట్రంప్ తాన అంటే తందాన అంటూ వత్తాసు పలుకుతోంది. చోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ కు నామినేట్ చేసిన వారిలో పాకిస్తాన్ కూడా ఒకటి. ఇది ఇంతకు ముందే జరిగింది. అయితే తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ ఈరోజు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో మరోసరి ఈ విషయంపై మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ లమధ్య కాల్పుల విరమణను కుదర్చడంలో అధ్యక్షుడు ట్రంప్ క్రియాశీలక పాత్ర పోషించారని...ఆయన అన్ని విధాలా నోబెల్ పీస్ బహుమతికి అర్హుడని ప్రకటించారు.  షెహబాజ్ మొత్తం 25 నిమిషాలు ప్రసంగంలో అంతా ట్రంప్ భజనే ఎక్కువగా చేశారు. ట్రంప్ శాంతి కాముకుడు అంటూ పదేపదే చెప్పారు. ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనంటూ ఒత్తిడి చేశారు. 

ప్రసంగం మొత్తం ట్రంప్ భజన..

అక్కడితో ఆగిపోకుండా తాము ట్రంప్ వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించామని పదే పదే చెప్పారు షెహబాజ్. ఇది చేయడంలో చురుకైన పాత్ర పోషించిన ట్రంప్, ఆయన బృందానికి పాక్ పీఎం కృతజ్ఞతలు తెలిపారు.  అమెరికా అధ్యక్షుడే లేకపోతే ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎవరూ ఉండేవారు కాదంటూ ట్రంప్ ను పొగడ్తల్లో ముంచిపడేశారు. దీని తరువాత భారతదేశంతో ఘర్షణల సమయంలో పాకిస్తాన్ కు దౌత్యపరమైన మద్దతు అందించినందుకు చైనా, టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్, అజర్ బైజాన్, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , UN సెక్రటరీ జనరల్ తో సహా దేశాలకు షెహబాజ్ కృతజ్ఞతలు తెలిపారు.

దీనికి ముందు పాక్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ ఛీప్ మునీర్ లు వైట్ హౌస్ లో ట్రంప్ ను కలిశారు. ఇరు నేతలూ దాదాపు గంటన్నర పాటూ సమావేశమయ్యారు. దీనికి మీడియాను కూడా అనుమతించలేదు.  పాక్ ప్రధాని వెంట ఆర్మీ ఛీప్ మునీర్ ఉండగా...ట్రంప్ తో పాటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఇరు నేతలూ ఏ విషయంపై చర్చించారని మాత్రం బయటకు రాలేదు.  కానీ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని మాత్రం తెలుస్తోంది. రష్యా చమురు కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు బలహీనమయ్యాయి. అప్పటి నుంచి అగ్రరాజ్యానికి దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వత్తాసు పలుకుతున్నారు. పాకిస్తాన్ కు దగ్గర అవడం ద్వారా భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన బావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు