/rtv/media/media_files/2025/09/11/kulman-ghisingh-appointedprime-minister-of-nepal-2025-09-11-13-36-32.jpg)
Kulman Ghisingh appointed as interim Prime Minister of Nepal..!
నేపాల్ తాత్కాళిక ప్రధానిగా కుల్మన్ ఘీసింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయన పేరును జన్-జెడ్ ప్రతిపాదించగా.. అన్ని వర్గాల నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది.కుల్మన్ గతంలో నేపాల్ విద్యుత్ బోర్డుకు ఎండీగా పనిచేశారు.ఆయన నియామకంపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో నేపాల్‌లో అల్లర్లు చెలరేగాయి. యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి సహా మంత్రులు రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: ముసలోడు కాదు...మూర్ఖుడు..11 ఏళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించడంలో నేపాల్ లో జెన్ జెడ్ ఉద్యమం ప్రారంభమైంది. దీనితోపాటు ప్రభుత్వ పెద్దల అవినీతి, అక్రమాలపై యువత ఉద్యమించింది. పలుచోట్ల ఆందోళన కారులు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయడంతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలి తో సహా పలువురు మంత్రులు, దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ సైతం తమ పదవులకు రాజీనామాలు చేశారు.
ప్రధాని రాజీనామా చేసినా.. ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో కాఠ్‌మాండూలో సైన్యం నిరవధిక కర్ఫ్యూ విధించి దేశాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకుంది. తాజాగా తాత్కాళిక ప్రధాని ఎంపిక కోసం ఏర్పాట్లు సాగుతున్న తరుణంలో కుల్మన్ ఘీసింగ్ పేరును ఉద్యమ కారులు ప్రతిపాదించినట్లు తెలిసింది.
Also Read : ప్రియుడితో దొరికిన భార్య....అర్థనగ్నంగా ఊరేగించిన భర్త..ట్వి్స్ట్ ఏంటంటే?