Nepal Ex PM Oli: వారి కారణంగానే పదవి కోల్పోయాను..భారత్ పై అక్కసు వెళ్ళగక్కిన నేపాల్ మాజీ ప్రధాని ఓలీ

నేపాల్ గందరగోళ పరిస్థితుల్లో దేశాన్ని విడిచి దుబాయ్ పారిపోయారు మాజీ ప్రధాని ఓలీ. దీని తర్వాత ఆయన ఈరోజు మొట్టమొదటిసారిగా మాట్లాడారు. దీంట్లో రాముడు అయోధ్యలో పుట్టలేదని అన్నందుకే పదవి కోల్పోవాల్సివచ్చిందటూ భారత్ పై అక్కసు వెళ్ళగక్కారు.

New Update
oli

Nepal EX PM Oli Sharma

నేపాల్ మాజీ ప్రధాని కే పీ ఓలీ శర్మ. నేపాల్ లో యువత చేపట్టిన జెన్ జీ హింసాత్మక ఆందోళనల దెబ్బకు రాజీనామా చేయాల్సి వచ్చింది. దేశం వదిలి పారిపోవాల్సి కూడా వచ్చింది. ప్రస్తుతం ఆయన దుబాయ్ లో ఆశ్రయం పొందుతున్నారని చెబుతున్నారు. పదవి నుంచి తప్పుకున్నాకఓలీ మొదటి సారి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో భారతపై ఆరోపణలను గుప్పించారు. మొదట నుంచీ, పదవిలో ఉన్నప్పుడు కూడా భారత్ వ్యతిరేకత విధానాలను అవలంబిస్తూ వచ్చిన ఓలీ... ఇప్పుడు పదవి కోల్పోయిన తర్వాత కూడా తన అక్కసును వెళ్ళగక్కారు. తాజాగా చేసిన ఆయన చేసిన ప్రకటనలో...రాముడు అయోధ్యలో పుట్టలేదన్నందుకే పదవి కోల్పోవాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలపై పెద్దగా ఏమీ మాట్లడకపోయినప్పటికీ.. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురలు నేపాల్‌ భూభాగాలేనని మళ్ళీ చెప్పారు.

నేను మొండివాడిని..

మాజీ ప్రధాని కే పీ ఓలీశర్మ..నేపాల్ విడిచి దుబాయ్ పారిపోయారన్న వాదన వినిపిస్తున్నప్పటికీ...తాజా ఆయన విడుదల చేసిన లేఖ ప్రకారం ఆయన అక్కడే శివపురిబ్యారెక్ లో భద్రంగా ఉన్నారని తెలుస్తోంది. అక్కడ నుంచి పార్టీ పేరుతో ఓలీ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురపై నేపాల్ వాదనలతో సహా జాతీయ సమస్యలపై తన దృఢమైన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు. దాంతో పాటూ రాముడి జన్మస్థలం అయోద్యలోకాదని..నేపాల్ ఉందని ఓలీ అన్నారు. దేశానికి సంబంధించిన నిర్ణయాలు, చర్యల విషయంలో జాగ్రత్తగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ కఠిన వైఖరి వల్లనే తాను అధికారాన్ని కోల్పోయానని...అవే తన రాజకీయ పతనానికి కారణమయ్యాయని తెలిపారు. సహజంగా తాను చాలా మొడివాడినని..అదే లేకపోతే చాలా క్రితమే వెనక్కు తగ్గేవాడిని చెప్పుకొచ్చారు. ఇదే వైఖరితోనే వైఖరితోనే నేపాల్ లో పనిచేస్తోన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ప్రభుత్వ నిబంధనలు పాటించి, స్థానికంగా రిజిస్టర్ చేసుకోవాలని డిమాండ్ చేశానని తెలిపారు. పై చెప్పిన విషయాలలో తాను రాజీ పడి ఉంటే చాలా ప్రయోజనాలను పొందేవాడిని ఓలీ లేఖలో రాశారు. దేశం కోసమే అన్నీ అర్పించానని.. తనకు పదవి, ప్రతిష్ఠ ఎప్పుడూ ముఖ్యం కాదని వివరించారు. తమ దేశంలో జరుగుతోన్న ఆందోళనలకు భారత్ కారణమని ఓలీ పరోక్షంగా ఆరోపించారు.

Also Read: BIG BREAKING: గ్రూప్-1 రీవాల్యుయేషన్ ఇష్యూ.. TGPSC సంచలన నిర్ణయం!

Advertisment
తాజా కథనాలు