Trump: జర్నలిస్ట్ ఖషోగ్గి హ్యతపై సౌదీ ప్రిన్స్ కు ప్రశ్న..రిపోర్ట్ పై అరిచిన ట్రంప్

సౌదీ అరేబియా ప్రిన్స్ తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న అధ్యక్షుడు ట్రంప్ కు కోపం తెప్పించింది. జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య వెనుక ప్రిన్స్ హస్తం ఉందనే ప్రశ్నను అడిగిన కారణంగా ఏబీసీ ఛానెల్ రిపోర్టర్ ట్రంప్ తో తిట్లు తిన్నారు.

New Update
trump, reporter

ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఏడేళ్ళ తర్వాత ఆయన అమెరికాకు వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.   ఏబీసీ ఛానెల్ కు సంబంధించిన ఓ రిపోర్టర్..సౌదీ అరేబియా ప్రిన్స్ ఎంబీఎస్ ను జర్నలిస్ట్ ఖషోగ్గి హత్యపై ప్రశ్నించింది. అంతే వెంటనే ట్రంప్ ఆమెపై గట్టిగా అరిచారు. ప్రిన్స్ ను సమర్ధిస్తూ..మీరు మాట్లాడుతున్న ఆ పెద్దమనిషి చాలామందికి నచ్చలేదు. మీకు నచ్చినా.. నచ్చకపోయినా అది జరిగిపోయింది.సౌదీ ప్రిన్స్‌కు దానిగురించి ఏమీ తెలియదు. మనం దాన్ని అలాగే వదిలేయాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగి మీరు అతిథిని ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదు అంటూ ఏబీసీ జర్నలిస్ట్ పై మండిపడ్డారు. అంతేకాదు ఆ ఛానెల్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. ఆ ఛానెల్ వి అన్నీ నకిలీ వార్తలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రశ్నకు ఎంబీఎస్ స్పందిస్తూ ఖషోగ్గి హత్య చాలా బాధాకరమైనదన్నారు.

అప్పుడు తగవు..ఇప్పుడు సంధి..

జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య 2018లొ జరిగింది. అప్పుడు ట్రంప్ మొదటి టర్మ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అప్పట్లో ఖషోగ్గి హత్య సౌదీ- అమెరికాల మధ్య దౌత్య సంక్షోభానికి దారితీసింది. అంతేకాదు ఈ హత్య వెనుక సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని ారోపణలు వచ్చాయి. దీన్ని అమెరికా ఇంటలిజెన్స్ విభాగం కూడా ధృవీకరించింది. అయితే ప్రస్తుతం ట్రంప్ అమెరికా-సౌదీ అరేబియా సంబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖషోగ్గి హత్య టైమ్ లో ఏర్పడిన దౌత్య సంక్షోభాన్ని దూరం చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశానికి ఎఫ్-35 ఫైటర్ జెట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే యూఎస్‌లో 1 ట్రిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాలనే కీలక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. దాంతో ాటూ సౌదీ ప్రిన్స్ వచ్చిన సందర్భంలో పెద్ద విందును కూడా ఏర్పాటు చేశారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ేర్పాటు చేసిన ఈ విందుకు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తో పాటూ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు కరిస్టియానో రొనాల్డో, ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ కూడా పాల్గొన్నారు.  

Also Read: PM Modi: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ వాచ్ ..దీని ఖరీదు ఎంతో తెలుసా?

Advertisment
తాజా కథనాలు