Pak-Afghan: ఆఫ్గాన్ తో చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం..పాక్ మంత్రి ఖ్వాజా

ఇస్తాంబుల్ లో ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ ల మధ్య మళ్ళీ శాంతి చర్చలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో..చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు.

New Update
khwaja

ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ ల మధ్య పొత్తు కుదరడం లేదు. ప్రస్తుతం తాత్కాలిక కాల్పుల విరమణలో ఉన్న రెండు దేశాలు మళ్ళీ శాంతి చర్చల్లో పాల్గొన్నాయి. ప్రస్తుతం టర్కీలోని ఇస్తాంబుల్ లో టర్కీ, ఖతార్ మధ్యవర్తిత్వంలో ఆఫ్ఘాన్, పాకిస్తాన్ ల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆఫ్ఘాన్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ సారి శాంతి శాంతి చర్చలు విఫలం అయితే బహిరంగ యుద్ధం తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ఘన్, పాకిస్తాన్ ప్రతినిధులు టర్కీలో సమావేశం కావడానికి కొన్ని గంటల ముందు ఖ్వాజా హెచ్చరికలు జారీ చేశారు. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆసిఫ్ ఆరోపించారు.

పలు అంశాలపై సుదీర్ఘ చర్చ..

ఈరోజు జరిగే చర్చల్లో సరిహద్దు ఘర్షణలు, డ్రోన్ దాడులు, పాకిస్తాన్ వాణిజ్య క్రాసింగ్ లను మూసివేయడం వంటి అంశాలను పరిష్కరించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ డేటా ప్రకారం 8,000 కంటే ఎక్కువ ఆఫ్ఘన్కంటైనర్లు పాకిస్తాన్‌లో చిక్కుకున్నాయి. 4,000 కంటే ఎక్కువ కంటైనర్లు ప్రవేశం కోసం వేచి ఉన్నాయి. దీనివల్ల రెండు వైపులా ఆర్థిక నష్టాలు పెరుగుతున్నాయని ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన టోలో న్యూస్ తెలిపింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. అందుకే డ్రోన్ దాడులు చేపట్టామని సమర్థించుకుంటోంది. ఆఫ్ఘాన్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పి కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్ లో సమావేశం తీవ్ర ఒత్తిడుల మధ్య ప్రారంభమవనుంది.

రెండో రౌండ్ చర్చలు విఫలం..

అంతకు ముందు టర్కీ వేదికగా అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ మధ్య జరిగిన దీర్ఘకాలిక శాంతి చర్చలు విఫలమైనట్టు ఇరు దేశాల అధికార మీడియాలు ప్రకటించాయి. ఇరు దేశాలు ఒక అభిప్రాయానికి రాలేకపోవడమేకాక..నువ్వంటే నువ్వని కొట్టుకుంటున్నాయి. దీంతో త్వరలోనే పాక్, ఆఫ్ఘాన్ ల మధ్య మళ్ళీ యుద్ధం జరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. పాక్‌పై ఉగ్రదాడులకు తన భూభాగాన్ని ఉపయోగించబోమన్న హామీ ఇవ్వడం సహా 'తార్కిక, చట్టబద్ధమైన డిమాండ్లను' అఫ్గన్ అంగీకరించకపోవడం వల్లే ప్రతిష్టంభన ఏర్పడిందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. కానీ ఆఫ్ఘాన్ మాత్రం తాము అన్ని రకాల ప్రయత్నాలను చేశామని చెప్పింది.

Also Read: J&K: కాశ్మీర్ లో దాడులకు లష్కరే, జైషే ఉగ్రవాదులు సంయుక్తంగా ప్లాన్..

Advertisment
తాజా కథనాలు