భారీ భద్రత నడుమ ఖిలిదా అంత్యక్రియలు.. తరలివచ్చిన వేలాది జనం

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా అంతక్రియలు ముగిశాయి. ఢాకాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఖాలిదా అంత్యక్రియలకు భారత్‌ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు.

New Update
Khaleda Zia’s funeral prayer held in Bangladesh amid tight security

Khaleda Zia’s funeral prayer held in Bangladesh amid tight security

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధానమంత్రి ఖాలిదా జియా అంతక్రియలు ముగిశాయి. ఢాకాలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. ఖాలిదా అంత్యక్రియలకు భారత్‌ నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఆమె కుమారుడు తారిఖ్‌ రహ్మాన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన లేఖను అందజేశారు. ఢాకాకు చేరుకున్న వెంటనే రహ్మాన్‌ను జై శంకర్ కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.  

Also Read: దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మే.. జొమాటో, స్విగ్గీ బంపర్ ఆఫర్‌

ఇకవివరాల్లోకి వెళ్తే.. జియా ఖలిదా మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అంత్యక్రియలు బుధవారం  ఢాకాలోని మాణిక్ మియా ఎవెన్యూలో జరిగాయి. ఆమె భర్త జియావుర్‌ రహ్మాన్‌ సమాధి పక్కనే ఈ కార్యక్రమం నిర్వహించారు. బైతుల్ ముకరం జాతీయ మసీదు ఉపదేశకుడు ముఫ్తీ మహమ్మద్ అబ్దుల్ మాలెక్.. ఖలీదా అంత్యక్రియలు సంబంధించిన ప్రార్థన నిర్వహించారు. మరోవైపు బంగ్లాదేశ్‌ నేషనలిస్టు పార్టీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు నజ్రుల్ ఇస్లాం ఖాన్‌ ఆమె జీవిత చరిత్రను చదివి వినిపించారు. 

Also Read: చెల్లికి క్యాన్సర్ అని నమ్మించి స్నేహితుడికి రూ.2 కోట్లు బురిడి కొట్టించిన కి 'లేడి'

ఖాలిదా కొడుకు తారిఖ్‌ రహ్మాన్‌తో పాటు ప్రధాన పాలకుడు మహమ్మద్ యూనస్ కూడా ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు చేశారు. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వేలాది మంది జనాలు తరలివచ్చారు. బస్సులు, రైళ్లు, సొంత వాహనాల్లో ఢాకాకు చేరుకున్నారు. రాత్రి చలిని లెక్కచేయకుండానే అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలోనే ఉన్నారు. ఖాలిదా జియా 1991 నుంచి 1996 వరకు, 2001 నుంచి 2006 వరకు దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. 

Advertisment
తాజా కథనాలు