Kenya cancled Adani Projects:
అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో కెన్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూపుతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్ కాంట్రాక్ట్ , విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. విద్యుత్ సరఫరా లైన్ల నిర్మాణానికి పబ్లిక్- ప్రైవేటు భాగస్వామ్యం కింద 30 ఏళ్లకు గానూ..కెన్యా ప్రభుత్వం 736 మిలియన్ డాలర్ల ఒప్పందాన్న అదానీ గ్రూపుతో కుదుర్చుకుంది. ఇప్పుడు అది కాస్తా ఆగిపోయింది.
Also Read:గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఇక ఎయిర్ పోర్ట్ విషయానికి వస్తే..దానిని అదానీ గ్రూప్‌కు అప్పంగించేందుకు అక్కడి ప్రజలు వ్యతిరేకత చూపించారు. తమ దేశం వారికి ఇవ్వకుండా పై దేశాల వారికి ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆంతో ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. దీనిపై ఇప్పుడు స్వయంగా కెయా అధ్యక్షుడే ప్రకటన జారీ చేశారు. అంతేకాక కెన్యా రవాణా, ఇంధన మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది.
Also Read: NHRC: లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్..
Also Read: రేవంత్ ప్రభుత్వానికి షాక్..సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసిన ఎన్‌హెచ్‌ఆర్సీ