/rtv/media/media_files/2024/11/21/wlcbQFrQ9IB1eOb4QtXj.jpg)
NHRC Suo Moto Case:
నవంబర్ 11న ఫార్మా కంపెనీల ఏర్పాటు సంబంధించి భూసేకరణకు లగచర్ల సమీపంలో కలెక్టర్, ఇతర అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సందర్భంగా కొందరు రైతులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో చర్చలు జరపాలని కలెక్టర్ ను కోరారు. దీంతో గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై ఒక్కసారిగా కొందరు దాడులకు దిగారు. వారి వాహనాలను పెద్ద పెద్ద బండరాళ్లతో ధ్వంసం చేశారు. దీనిపై తెలంగాణ గవర్నమెంట్ వెంటనే చర్యలు చేపట్టింది. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?
దాంతో పాటూ ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆయన పోలీసుల ముందు లొంగిపోవడంతో అరెస్ట్ చేశారు. కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు సురేష్ ను హాజరుపరిచారు. లగచర్లలో కలెక్టర్ పై దాడి ఘటనలో సురేష్ A2గా ఉన్నాడు. కలెక్టర్ పై దాడికి గ్రామస్తులను రెచ్చగొట్టడంతో పాటు.. అధికారులను కావాలనే గ్రామంలోకి తీసుకెళ్లాడన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఘటన జరిగిన నాటి నుంచి ఆయన పరారీలో ఉన్నాడు.
ఇప్పుడు ఈ ఘటనను జాతీయ మానవహక్కుల కిషన్ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. దీనిపై రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి ఇష్యూ చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!
Also Read: ICC Arrest Warrant: ఇజ్రాయెల్ ప్రధానికి ఐసీసీ అరెస్ట్ వారెంట్
ఇది కూడా చూడండి: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్