Azerbaijan Airlines plane crash: అవును ఆ విమాన ప్రమాదం మా వల్లే జరిగింది..అంగీకరించిన పుతిన్

లాస్ట్ ఇయర్ అజర్ బైజాన్ విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఆ విమాన ప్రమాదం తమ వల్లే జరిగిందని ఆయన అన్నారు.  రష్యా ప్రయోగించిన క్షిపణుల వల్లనే ఫ్లైట్ దెబ్బ తిందని అంగీకరించారు.

New Update
putin

అజర్ బైజాన్ విమాన ప్రమాదం విషాదకరమైనది అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హామ్‌ అలియెవ్‌ తో భేటీ సందర్భంగా దీని గురించి మాట్లాడారు. ఆ విమానం తమ వల్లే కూలిపోయిందని మొదటిసారి అంగీకరించారు. ఏడాదిగా రెండు దేశాల మధ్యా జరుగుతున్న గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేందుకు క్షిపణులను ప్రయోగించామని..అవి అజర్ బైజాన్ విమానానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పేలిపోయానని పుతిన్ చెప్పారు. పౌర విమానంపై క్షిపణులు నేరుగా దాడి చేయలేదని..కానీ వాటి శకలాల వలన అది దెబ్బ తిందని చెప్పారు. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ బాధితులకు నష్ట పరిహారం అందిస్తామని పుతిన్ చెప్పారు. సంబంధిత అధికారులపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

నేరాన్ని అంగీకరించాల్సిందే..

రష్యా వల్లనే తమ దేశ విమానం ప్రమాదానికి గురైందని అజర్  బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియెవ్ అప్పటి నుంచే ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా...ప్రమాద కారణాన్ని ఇన్నాళ్ళు రష్యా దాచిందని విమర్శించారు. ఈ ఘటన తర్వాత కొన్ని రోజులకే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ క్షమాపణలు చెప్పినప్పటికీ.. జరిగిన నేరాన్ని అంగీకరించాలని అలియెవ్‌ డిమాండ్‌ చేశారు. దీని తర్వాత రష్యాలో స్థానిక పోలీసుల చేతిలో కొందరు అజర్‌బైజాన్‌ జాతీయులు ప్రాణాలు కోల్పోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనికి ఇన్నాళ్ళకు రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంత పరిచే చర్యలు చేపట్టారు. 

2024 డిసెంబర్ 25న అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాని రాజధాని బాకు నుంచి చెచెన్ రాజధాని గ్రోజ్నికి వెళుతుండగా ప్రమాదానికి గురైంది. రష్యా క్షిపణి దాడుల్లో ఇది దెబ్బ తింది. దీనిని గమరించి పైలెట్లు కజకిస్తాన్ లో ఫ్లైట్ ను ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా...అది కూలిపోయింది. ఈ విమానంలో మొత్తం 67 మంది ప్రయాణిస్తుండగా..38 మంది మృతి చెందారు. 

Also Read: Give Trump the Nobel: ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇచ్చేయండి..ఏఐ పిక్ తో ఇజ్రాయెల్ ప్రధాని హడావుడి

Advertisment
తాజా కథనాలు