/rtv/media/media_files/2025/12/07/terrorist-grps-2025-12-07-09-49-01.jpg)
భారత్ పై దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్లాన్ లు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి పాక్ లోని ఉగ్రవాద సంస్థలు ఇండియాపై పెద్ద దాడికి కుట్ర పన్నారని తెలుస్తోంది. భద్రతా సంస్థలకు ఉగ్రవాద సంస్థల రహస్య సమావేశం గురించి సమాచారం అందడంతో తాజాగా హై అలర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించి టాప్ ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కమాండర్లు సమావేశమయ్యారని చెబుతున్నారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి శనివారం పాకిస్థాన్‌లోని బహవల్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. నిజానికి బహవల్‌పూర్‌ను జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ బలమైన స్థావరం. ఇక్కడకు కసూరి తరచుగా వచ్చి వెళుతుంటారని చెబుతారు. జైష్ చీఫ్ మసూద్ అజార్‌తో రహస్యంగా సమావేశమవుతాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
భారీ కుట్రకు ప్లాన్..
తాజాగా మరోసారి కసూరి, మసూద్ అజార్ ను కలిశాడని..ఇద్దరూ కలిసి భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కుట్రకు ప్లాన్ చేసే అవకాశాలున్నాయని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. పహల్గామ్ దాడికి ముందు కూడా కసూరి బహవల్‌పూర్‌ను సందర్శించినట్లు సమాచారం. బహవల్‌పూర్‌లో ఇప్పుడు కసూరి హాజరైన కార్యక్రమానికి “సీరత్-ఎ-నబీ సహీహ్ బుఖారీ” అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా జిహాదీలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా భారత్ పై కుట్రకే ఇద్దరూ కలిశారని అంటున్నారు. రెండు ప్రధాన ఉగ్రవాద సంస్థల అగ్ర కమాండర్ల మధ్య జరిగిన ఈ సమావేశం భారత భద్రతా సంస్థలకు ఒక మేల్కొలుపు లాంటిదని చెబుతున్నారు. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మహిళలకు జీహాద్ ఆన్ లైన్ కోర్సులు..
ఇక జైషే మమహ్మద్ భారత్ కు వ్యతిరేకంగా మహిళా ఉగ్రవాదులను కూడా రంగంలోకి దింపుతోందని తెలుస్తోంది. ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో పట్టుబడిన ఉగ్రవాదుల్లో కూడా ఒక మహిళ ఉండడం, దానికి పట్టుబడ్డ షహీన్ భారత్ లో నాయకురాలని తెలిసింది. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన మహిళా వింగ్ జమాత్ ఉల్ మోమినాత్'లో కొద్ది వారాల్లోనే 5,000 మందికి పైగా మహిళలను నియామకం చేశారని తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ అజారే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీరికి ఉగ్రవాదం వైపుగా తర్ఫీదునిస్తున్నారు. ఈ నియామకాలు అక్టోబర్ 8వ తేదీన జైష్ ప్రధాన కార్యాలయం మార్కజ్ ఉస్మాన్-ఓ-అలీ వద్ద ప్రారంభం అయ్యాయి. పాకిస్థాన్‌లోని బహవల్పూర్, ముల్తాన్, సియాల్‌కోట్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి వంటి ప్రాంతాల నుంచి మహిళలను ఇందులో చేర్చుకున్నారు. వీరందరికీ ఆన్ లైన్ లో జీహాద్ కు సంబంధించిన కోర్సు తరగతులు చెప్పనున్నారు. ఇవి 40 నిమిషాల పాటూ ఉంటాయని, ప్రతి సభ్యురాలు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఐఎస్‌ఐఎస్, హమాస్, ఎల్‌టీటీఈ తరహాలో ఫిదాయిన్ (ఆత్మాహుతి) దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్‌లను ఏర్పాటు చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు.
Follow Us