Pakistan: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి...22మంది మృతి

పాకిస్తాన్ లో నిన్న రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో 22 మంది మరణించారు. మరో 120 మందికి పైగా గాయపడ్డారు. బలోచ్ మద్దతుదారులు టార్గెట్ గా ఈ దాడి జరిగింది. 

New Update
pakistan

suicide bombing in Pakistan

పాకిస్తాన్, బెలూచిస్తాన్ మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా నిన్న రాత్రి బలోచిస్తాన్ లో పాకిస్తాన్ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. బలోచ్‌ రాజధాని క్వెట్టాలో బలోచిస్థాన్‌ నేషనల్‌ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్‌ వర్ధంతి సభలో ఈ ఘోరం జరిగింది. బీఎన్ పీ నిర్వహించి ఈ సమావేశానికి వందలాది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తి జనం మధ్యలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే చనిపోగా...మరో 120 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బలోచ్ ప్రజలే టార్గెట్ గా ఈ దాడి జరిగింది. 

ఎవరు చేశారో తెలియలేదు..

ఈ ఘటనపై పాక్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతా బలగాలు దాడి జరిగిన ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి  చేశారన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఏ ఉగ్ర సంస్థా ఇంత వరకూ ప్రకటన చేయలేదు. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వాలోనూ మానవ బాంబు దాడి జరిగింది. ఇందులో 12 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు పాకిస్తాన్ ఆర్మీ, ఆరుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు.  

Advertisment
తాజా కథనాలు