Israel Attack on Hezbollah:
ఇజ్రాయెల్..హెజ్బుల్లా మీద ప్రత్యక్ష దాడులకు దిగిపోయింది. వారిని సమూలంగా నాశనం చేయడమే లక్ష్యమని చెబుతోంది. ఎన్నో ఏళ్ళుగా హెజ్బుల్లా ఆయుధాలను దాస్తోందని.. లెబనాన్ పౌరుల గృహాల కింద వాటని దాస్తోందని అంటోంది ఇజ్రాయెల్. అలాగే పౌరులను కవచాలుగా ఉపయోగించడంతో పాటూ దక్షిణ లెబనాన్‌ను యుద్ధ భూమిగా మార్చిందని ఐడీఎఫ్ ఆరోపించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని నివాసితులు వారి ఇళ్లకు తిరిగి వచ్చేలా భద్రతను స్థాపించేందుకు, యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తోందని ప్రకటించింది.
మరోవైపు ఈ దాడులను హెజ్బుల్లా ఛీఫ హసన్ నస్రల్లా ఖండించారు. పేజర్లు, వాకీ టాకీలు పేలడన్ని ఆయన యుద్ధనేరంగా పరిగణించారు. దాదాపు నాలుగు వేల పేజర్లను లక్ష్యంగా చేసుకున్నారని.. 4000 మందిని ఏకకాలంలో చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. రెండో రోజు దాడిలో వాకీటాకీలు పేల్చి.. మరో వెయ్యి మందిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
Also Read : లెబనాన్ కీలక నిర్ణయం.. పేజర్లు, వాకీటాకీలు నిషేధం