/rtv/media/media_files/2026/01/27/iran-2026-01-27-20-25-04.jpg)
Iran's currency falls to record low after nationwide protests
ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ దేశ కరెన్సీ(iran currency) విలువ అత్యంత దారుణమైన స్థితికి పడిపోయింది. ఒక యూఎస్ డాలర్ దాదాపు 1.5 మిలియన్ రియాల్స్‌కు ఎగబాకింది. ఇరాన్ చరిత్రలో ఇలా కరెన్సీ విలువ కనిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. జనవరి 27న యూఎస్ డాలర్ విలువ 1,504,000 ఇరానియన్ రియాల్స్‌కు చేరింది. మరికొన్ని నివేదికలైతే 1.65 మిలియన్ రియాల్స్‌కు కూడా చేరి ఉండొచ్చని చెబుతున్నాయి.
Also Read: భారత్ దెబ్బ.. పాక్ అబ్బా.. UAE డీల్ క్యాన్సెల్.. అసలేం జరిగిందంటే?
Iran's Currency Falls To Record
అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా ఇరాన్‌లో చమురు ఎగుమతులు తీవ్రంగా తగ్గిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ డాలర్ల కొరత ఏర్పడింది. గతేడాది డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 42 శాతానికి పైగా పెరిగింది. నిత్యావసర ధరలు 70 శాతానికి పైగా పెరిగాయి. ఇరాన్ ప్రజలు కూడా తమ పొదుపులను డాలర్లు, బంగారం లేదా ఆస్తిగా మార్చుకుంటున్నారు. దీనివల్ల దాని కరెన్సీపై మరింత ఒత్తిడి పెరుగుతోంది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తత పరిస్థితులు, దేశీయ ఆర్థిక విధానాలు రియాల్ పతానానికి కారణమయ్యాయి.
Also Read: మెక్సికోలో నరమేధం: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం.. 11 మంది మృతి
ఇరాన్‌లో ప్రస్తుతం కనీస వేతనం నెలకు 100 డాలర్లకు పడిపోయింది. పలు నివేదికల ప్రకారం అక్కడి దేశ జనభాలో 22 నుంచి 50 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. ఇదిలాఉండగా ఇటీవల ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ అధికారం నుంచి దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. నిరసనాకారులను అణిచివేసేందుకు ప్రభుత్వం చేసిన కాల్పుల్లో ఇప్పటిదాకా 6 వేల మందికి పైగా మరణించినట్లు మానవ హక్కులు సంస్థలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వం సైతం3,117 మంది చనిపోయినట్లు తెలిపింది. అయితే ఇరాన్‌లో ఇలా రోజురోజుకు కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
Follow Us