రష్యాపై ఉక్రెయిన్‌ క్షిపణుల దాడి.. జెలెన్‌స్కీ సంచలన నిర్ణయం!

రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగిన ఉత్తరకొరియా సైనికులను అడ్డుకునేందుకు క్షిపణులు వినియోగిస్తామన్నారు. ఇందుకు తమ మిత్ర దేశాలు అనుమతివ్వాలని జెలెన్‌స్కీ కోరారు. 

author-image
By srinivas
New Update
dgdesew

Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం మరింత వేడెక్కుతోంది. కీవ్‌ను పూర్తిగా ద్వంసం చేయాలనే లక్ష్యంతో దాడుల చేస్తున్న రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైనికులు రంగంలోకి దిగుతుండగా.. వారిని అడ్డుకునేందుకు క్షిపణుల వినియోగిస్తామని జెలెన్‌స్కీ చెబుతున్నారు. ఈ మేరకు శనివారం ఈవిషయంపై మిత్ర దేశాలతో మాట్లాడిన జెలెన్‌స్కీ.. రష్యాపై క్షిపణులు ప్రయోగించడానికి అనుమతివ్వాలని మిత్ర దేశాలను కోరారు. 

ఉత్తరకొరియా సైనికుల స్థావరాలపై నిఘా..

రష్యా భూభాగంలో ఉత్తరకొరియా సైనికుల స్థావరాలపై నిఘా పెడుతున్నాం. మా దగ్గర దూర లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఉంటే వారిని అడ్డుకుంటాం. రష్యా కర్మాగారాల్లో ఉత్తర కొరియా సైనికులు, ఆయుధాలతోపాటు కుర్స్క్‌లోను వారి సైనికులే ఉన్నారు. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో మిత్రదేశాలు ఆయుధ సహాయం చేయకుండా ఉత్తర కొరియా సైన్యం దాడి చేసేవరకు వెయిట్ చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. 

ఇది కూడా చదవండి: Gorantla Madhav: మాజీ ఎంపీ గోరెంట్లపై మరో ఫిర్యాదు.. అసభ్యకరంగా..

నెల రోజుల్లో రష్యా 2,023 డ్రోన్ల ప్రయోగం..

ఇదిలా ఉంటే.. నెల రోజుల్లో రష్యా 2,023 డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. 1,185 డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగా 738 డ్రోన్ల వల్ల నష్టం వాటిల్లిందన్నారు.  2024 నుంచి ప్రత్యర్థి రష్యా మా దేశంపై 6,987 డ్రోన్లను ప్రయోగించింది. జనావాసాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీన్నాయని చెప్పారు. అయితే ఉక్రెయిన్‌ ఆరోపణలను రష్యా ఖండించింది. 

ఇది కూడా చదవండి: కాళ్లు, చేతులు కట్టేసి ఘోరం.. ఏపీలో మరో మహిళపై గ్యాంగ్‌ రేప్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు