/rtv/media/media_files/2026/01/12/iran-2026-01-12-20-53-24.jpg)
Iran draws tens of thousands of pro-government demonstrators to the streets
ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సైనిక సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో ఇప్పటిదాకా 500 మందికి పైగా మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌వ్యాప్తంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవాళ్లు రోడ్ల పైకి వస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ప్రదర్శలు చేస్తున్నారు. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారి లక్షలాది మంది సపోర్టర్లను వీధుల్లోకి దింపింది.
Also Read: ఈజీగా అప్పులు, తగ్గనున్న పన్నులతో పాటు.. ఈ కేంద్ర బడ్జెట్లో హైలైట్స్ ఇవే?
రాజధాని టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్ దగ్గర వేలాది మంది ప్రదర్శనకారులు గుమికూడారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులు ఈ ప్రదర్శనలో భాగమయ్యారు. కెర్మన్, రష్త్, జాహెదాన్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రదర్శనలు నిర్వహించారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా కంట్రోల్‌లోకి వచ్చాయని అబ్బాస్ అరాఘ్చి ఇప్పటికే ప్రకటించారు.
Follow Us