Trump Vs BRICS: ట్రంప్ vs బ్రిక్స్..వాణిజ్య యుద్ధంలో గెలిచేదెవరు?

ప్రస్తుతం ప్రపంచంలో వాణిజ్య యుద్ధం నడుస్తోంది. బ్రిక్స్ దేశాలు వెర్సస్ అమెరికా గా ఇది నడుస్తోంది. ఇందులో ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  దాంతో పాటూ అమెరికా, రష్యా చర్చల మీద కూడా అందరూ చర్చించుకుంటున్నారు.

New Update
trump vs brics

TRUMP VS BRICS

10 మంది సభ్యులతో కూడినది బ్రిక్స్. ఇందులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలు ముఖ్యమైనవి. ఇప్పుడు ఈ దేశాలకు, అమెరికాకు మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఇందులో అన్ని దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారాలు చేస్తున్నాయి. ఆ దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల్లో భాగస్వామ్యులుగా కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు అమెరికా అన్ని దేశాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటోంది. గత కొంతకాలంగా ఆర్థికంగా బాగా చితికిపోయిన అమెరికాను మళ్ళీ పైకి తీసుకురావడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మిగతా దేశాల మీద సుంకాల బాదుడు బాదుతున్నారు. ఆ వచ్చిన డబ్బుతో అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టాలనేది ఆయన తపన. దీని కోసం ట్రంప్ అడ్డదిడ్డంగా అన్ని దేశాల మీద టారీఫ్ లు విధిస్తున్నారు. తన మాట వినేవాళ్ళ మీద ఒకలా...వినకపోతే మరొకలా సుంకాలు విధిస్తున్నారు.  

రష్యా మీదనే వత్తిడి అంతా..

బ్రిక్స్ దేశాల్లో రష్యా ఒకటి. ప్రస్తుతం ఈ దేశం మీద అమెరికా అధ్యక్షుడు కోపంగా ఉన్నారు. దానికి కారణం ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపకపోవడమే. ట్రంప్ దీనిపై ఎన్నిసార్లు చర్చలు చేసినా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయన మాట లెక్కపెట్టడం లేదు. దీంతో ఆ దేశంపై మరోలా వత్తిడి తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాతో వాణిజ్యం చేసే దేశాల మీద వత్తిడి తీసుకువచ్చారు. తన మాట వినకపోతే అదనపు సుంకాలు విధిస్తామని బెదిరించారు. అయితే భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు ట్రంప్ ను లెక్క చేయలేదు. ఈ కారణంతో భారత్, బ్రెజిల్ మీద 50 శాతం సుంకాలతో దాడి చేశారు. ఆగస్టు 27 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని చెప్పారు. అయితే ఈ సుంకాలను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ట్రంప్ ఆంక్షలకు తలొగ్గేదే లేదు అని చెప్పింది. దీనికి రష్యా, చైనా మద్దతు తెలిపాయి. బ్రిక్స్ దేశాలు కూడా ట్రంప్ చేస్తున్నది అన్యాయమంటూ ఎదురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిక్స్ దేశాలు, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధానికి తెర లేచింది. ఇది సద్దుమణగాలంటే మొత్తం రష్యా చేతుల్లోనే ఉంది. 

ఈ నేపథ్యంలో ఆగస్టు 15న రష్యా, అమెరికా అధ్యక్షులు అలస్కాలో మరోసారి భేటీ అవుతున్నారు. ఇందులో ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంపై చర్చలు జరుగుతాయని తెలిపారు. రష్యా కాల్పుల విరమణకు ఒప్పుకుని శాతం ఒప్పందం చేసుకోవాలని అమెరికా కోరుతోంది. దీనికి రష్యా ఒప్పుకుంటే బ్రిక్స్ దేశాల మీద అదనపు సుంకాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.  అయితే ఇప్పుడు రష్యా...ట్రంప్ పెట్టే ఆంక్షలకు ఒప్పుకుంటుందా లేదా అనేది తెలియడం లేదు. అటు ఉక్రెయిన్ కూడా అమెరికా అధ్యక్షుడు చెప్పే అన్ని మాటలకు తలొగ్గేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి మాస్కోకు బహిరంగ గడువు విధించినప్పటికీ, యుద్ధానికి రష్యా అందించే నిధులను నిలిపివేయడమే తన సుంకాల దాడి అని ట్రంప్ నొక్కి చెబుతున్నారు. ఇక ట్రంప్ అదనపు సుంకాలపై సొంత దేశం అమెరికాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. అలాగే తొమ్మిదేళ్ళ తర్వాత భారత ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళుతున్నారు. ఇందులో సుంకాల మీద చర్చలు జరిగే అవకాశం అంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు