/rtv/media/media_files/2026/02/10/us-bangladesh-2026-02-10-11-15-19.jpg)
us-bangladesh
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య సోమవారం వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం తర్వాత.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కుదిరిన ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ వస్త్రాలు, ఇతర ఉత్పత్తులపై అమెరికా సుంకాలను 19 శాతానికి తగ్గించింది. గతంలో ఈ సుంకాలు 20 శాతం నుంచి 37 శాతం మధ్యలో ఉండగా ఇప్పుడు వాటిని తగ్గించింది. అయితే అమెరికా నుండి దిగుమతి చేసుకున్న పత్తి, ఇతర ముడి పదార్థాలతో తయారు చేసే వస్త్రాలకు 'జీరో' సుంకం వర్తించేలా మెకానిజంను ఏర్పాటు చేస్తామని అమెరికా హామీ ఇచ్చింది.
ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
బంగ్లా వస్త్ర పరిశ్రమకు..
ఈ ఒప్పందంతో బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు మేలు జరగనుంది. పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సాన్నిహిత్యంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ వాణిజ్యపరంగా పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితాలు దక్కలేదు. అమెరికా కొత్త టారిఫ్ విధానం ప్రకారం పాకిస్థాన్ వస్తువులపై సుంకం సుమారు 19 శాతంగా ఉంది. ఇది భారత్ కంటే ఒక శాతం ఎక్కువ. దౌత్యపరంగా అమెరికా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాల విషయంలో భారత్‌కే ప్రాధాన్యత ఇస్తోంది.
ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో పోలిస్తే భారత్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం కాస్త స్ట్రాంగ్ అని చెప్పవచ్చు. ఫిబ్రవరి 2026లో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. భారత ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న పన్నును ఏకంగా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించాలి లేదా పూర్తిగా నిలిపివేయాలని ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిగా అమెరికా తన అదనపు 25% శిక్షాత్మక సుంకాలను తొలగించింది. రాబోయే 5 ఏళ్లలో భారత్ అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ల విలువైన ఎనర్జీ, టెక్నాలజీ, విమాన విడిభాగాలను కొనుగోలు చేయనుంది. అలాగే సెమీకండక్టర్లు, GPUs, క్లీన్ ఎనర్జీ రంగాల్లో భారత్, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాలు దీర్ఘకాలికమైనవి. ఈ కారణంగానే అమెరికా-భారత్ మధ్య మెగా ట్రేడ్ డీల్ కుదిరింది.
ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us