Earthquake Alerts: రష్యా, జపాన్‌లో సునామీ.. భారతీయులకు బిగ్ అలర్ట్

పసిఫిక్ సముద్ర తీరంలో రష్యా, జపాన్‌లో భూకంపం, సునామీ సంభించాయి. హవాయిలో కూడా సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అక్కడున్న ఇండియన్ కాన్సులేట్ అప్రమత్తం చేసింది. శ్రాన్స్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది.

New Update
San Francisco issues

రష్యాలోని పసిఫిక్ సముద్ర తీరంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.7గా నమోదైంది. కమ్చట్కా ద్వీపకల్పం సమీపంలో భూకంప కేంద్ర ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. సముద్రంలో భూకంపం సభంవించడంతో తూర్ప రష్యాలో, జపాన్‌లో సునామీ వచ్చింది. సముద్ర అలలు మూడు మీటర్ల ఎత్తులో  విరుచుకుపడుతున్నాయి.

హవాయిలో కూడా సునామీ సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో అక్కడున్న భారతీయులను రాయబారి కార్యాలయం అప్రమత్తం చేసింది. శ్రాన్స్‌ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది. సునామీ, భూకంపంతో కాన్సులేట్ అప్రమత్తమైంది. కాలిఫోర్నియా, హవాయిలోని భారత పౌరులకు అలర్ట్‌గా ఉండాలని సూచించింది. అత్యవసర సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది. 1- 415- 483- 6629 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. వాటి జాబితాని అమెరికా సునామీ వార్నింగ్‌ సిస్టమ్‌ విడుదల చేసింది.

3 మీటర్ల కంటే ఎత్తయిన అలలు ఎగసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్‌, రష్యా, వాయువ్య హవాయి దీవులున్నాయి. 3 మీటర్ల లోపు అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్‌ పాలినేషియా, గువామ్‌, హవాయి, జపాన్‌, జార్విస్‌ ఐలాండ్‌, జాన్‌స్టన్‌ అటోల్‌, కిరిబాటి, మిడ్‌వే ఐలాండ్‌, పాల్మిరా ఐలాండ్‌, పెరూ, సమోవా, సోలోమన్‌ దీవులు ఉన్నాయి. అమెరికాలోని పశ్చిమ తీర రాష్ట్రాలతో పాటు న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.

Advertisment
తాజా కథనాలు