Ind-Pak War : పాకిస్తాన్ ఫతే-1 మిస్సైల్‌ని కూల్చివేసిన ఇండియా

పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి పాకిస్థాన్‌ మిస్సైల్ ఫతే-1ను ప్రయోగించింది. దీన్ని భారత రక్షణ సిబ్బంది అడ్డుకుంది.

author-image
By Madhukar Vydhyula
New Update

Ind-Pak War: భారతదేశం, పాకిస్థాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో రెండు దేశల మధ్య ఉద్రిక్తలు మరింత పెరుగుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్‌ పాక్‌ సరిహద్దుల్లోని 9 ఉగ్ర శిబిరాలపై భారత్‌ దాడి చేసింది. దీంతో రెచ్చిపోయిన పాకిస్థాన్‌  శుక్రవారం డ్రోన్‌లతో దాడికి దిగింది. సరిహద్దుల వెంట వందలాది డ్రోన్లను ప్రయోగించింది. దీన్ని  భారత్ సైన్యం తిప్పి కొట్టింది. అదే సమయంలో దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని  కీలక ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. మరో వైపు పాక్‌ సైన్యానికి ప్రధాన కేంద్రంగా ఉన్న రావల్పిండిని భారత్‌ టార్గెట్‌ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పాకిస్తాన్ లో ఉన్న ప్రధాన  ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసింది. 

Also Read: BIG BREAKING: తెగబడ్డ పాక్.. ఏకంగా ఢిల్లీపైకి క్షిపణి!

ఇక శనివారం తెల్లవారుజాము నుంచి భారత్‌  లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, సియాల్ కోట్, నర్వాల్ ఇలా పాక్‌ లోని అన్ని ఎయిర్‌ బేస్‌ల మీదా దాడిచేసి వాటిని ధ్వంసం చేసింది. దీంతో మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్‌  ప్రతీకారంగా నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులకు తెగబడింది. అయితే దాన్ని కూడ ఇండియా తిప్పి కొట్టింది.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా కూల్చివేసింది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి పాకిస్థాన్‌ మిస్సైల్ ఫతే-1ను ప్రయోగించింది. దీన్ని భారత రక్షణ సిబ్బంది అడ్డుకుంది. అదే సమయంలో ఉదంపూర్, పఠాన్ కోట్, జమ్మూ, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో పాక్ ప్రయోగించిన అన్ని మిస్సైళ్లను భారత్ కుప్పకూల్చింది.

ఇది కూడా చూడండి:BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

Advertisment
తాజా కథనాలు