/rtv/media/media_files/2025/03/12/0QUrNOt6XCDZhpuTS5xo.jpg)
PM Modi and Mauritius PM naveen chandra ramgulam
ప్రధాని మోదీ ప్రస్తుతం మారిషస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులామ్‌తో కలిసి పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. భారత్, మారిషస్ రిజర్వ్ బ్యాంకులు పరస్పరం సహరించుకోవాలని నిర్ణయించాయి. ఇరుదేశాల మధ్య మొత్తం 8 కీలక అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. నేర పరిశోధన, సముద్ర ట్రాఫిక్ నిఘా, మౌలిక సదుపాయాల దౌత్యం, వాణిజ్యం, సామర్థ్య నిర్మాణం, ఆర్థిక, సముద్ర సంబంధిత ఆర్థిక వ్యవస్థ వంటి ఒప్పందాలు ఉన్నాయి.
Also Read: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, విద్య, కనెక్టివిటీ ప్రాజెక్టులకు మద్దతునిస్తూ కీలక భాగస్వామిగా భారత్ ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. అలాగే మారిషస్‌కు అన్ని రంగాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యారంగమైనా, రక్షణ రంగమైనా భారత్ నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య తరతరాలుగా మంచి సంబధాలు ఉంటున్నాయని గుర్తుచేశారు.
Also Read: కొనసాగుతున్న టారిఫ్ వార్..కెనడా మెటల్స్ మీద 50శాతం సుంకాలు
మరోవైపు భారత్ నుంచి మారిషస్‌కు గ్రాంట్ రూపంలో సాయం అందించాలని నిర్ణయించారు. ఇది మారిషస్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. మారిషస్ తమకు కేవలం భాగస్వామ్య దేశం మాత్రమే కాదని.. ఒక కుటుంబం లాంటిదని పేర్కొన్నారు. అంతేకాదు మారిషస్‌లో నూతన పార్లమెంట్ నిర్మాణం కోసం భారత్ సహకరిస్తుందని చెప్పారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరఫున మారిషస్ ప్రజలకు నేషనల్ డే శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: హైజాక్ నుంచి 104మందిని రక్షించిన పాక్ ఆర్మీ..16 మంది ఉగ్రవాదులు హతం
Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు