/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలను విధించింది. దీంతో ఇరు దేశాల మధ్యనా వాణిజ్యం కొన్ని రోజులుగా స్తంభించింది. ఈ మధ్యనే అమెరికా అధ్యక్షఉడు ట్రంప్ కాస్త దిగి రావడంతో మళ్ళీ వాణిజ్య చర్చలు ట్రాక్ మీదకు వచ్చాయి. త్వరలోనే అమెరికా నుంచి ప్రతినిధులు భారత్ కు రానున్నారని ఇరు దేశాలు కన్ఫార్మ్ చేశాయి. ఈ నేపథ్యంలో ట్రంప్... మోదీ తనకు మంచి స్నేహితుడని అన్నారు.
చాలా మంచి స్నేహం..అయినా తప్పదు.
తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో ద్వైపాక్షిక సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. భారత్ తో మాకు ఎప్పుడూ మంచి సంబంధాలున్నాయి. ప్రధాని మోదీ నాకు మంచి స్నేహితుడు. రీసెంట్ గా ఆయన పుట్టిన రోజు నాడు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. శుభాకాంక్షలు తెలియజేశాను. మా ఇద్దరి మధ్యనా మంచి స్నేహం ఉంది. ఆయన కూడా చాలా మంచి ప్రకటన చేశారు. అయినా కూడా భారత్ పై సుంకాల విషయంలో పెద్దగా ఏ మార్సూ ఉండదని ట్రంప్ అన్నారు. మరిన్ని వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాని తెలిపారు. చైనా ఇప్పుడు భారీ స్థాయిలో అమెరికాకు సుంకాలు చెల్లిస్తోంది. మరిన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నా. చమురు కొనుగోలు ఆపివేస్తేనే రష్యా దిగివస్తుంది అని ట్రంప్ స్పష్టం చేశారు. ఆ దేశం ఉక్రెయిన్ తో కొనసాగిస్తున్న యుద్ధాన్ని ఆపాలంటే భారత్, చైనాలపై ఒత్తిడి తీసుకు రావాల్సిందేనని అన్నారు.
సుంకాలు తగ్గుతాయ్..
మరోవైపు నవంబర్ తర్వాత ట్రంప్ 25శాతం సుంకాలు వెనక్కి తీసుకునే అవకాశం ఉందని భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొన్ని నెలలుగా భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తున్న సుంకాల వివాదంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల భారతీయ ఉత్పత్తులపై అమెరికా విధించిన అదనపు 25 శాతం సుంకం నవంబర్ 30 తర్వాత ఉండకపోవచ్చని ఆయన అన్నారు.గత కొన్ని వారాలుగా పరిస్థితుల్లో సానుకూల మార్పులు వస్తున్నాయని, అందువల్ల ఈ అదనపు సుంకాలు త్వరలోనే రద్దు అవుతాయని నాగేశ్వరన్ నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read: Air India Flight: విశాఖ-హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం