Imran Khan: నాకేమైనా జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ దే బాధ్యత.. ఇమ్రాన్ ఖాన్

జైల్లో తనకేదైనా అయితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దే బాధ్యతని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తన పార్టీ సభ్యులకూ ఇదే విషయాన్ని చెప్పానని చెప్పారు. జైల్లో తాను వేధింపులు ఎదుర్కోవడం ఎక్కువైందని చెప్పుకొచ్చారు. 

New Update
Imran Khan

Imran Khan

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఈయన 2023 ఆగస్టు నుంచి జైల్లోనే ఉంటున్నారు. తమ నేతను విడుదల చేయాలంటూ ప్రభుత్వం, సైన్యంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇమ్రాన్‌కు చెందిన పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నేతలు చాలా సార్లు ఇప్పటికే నిరసనలు, అల్లర్లు చేశారు. వీరు మరోసారి నిరసనలు చేసేందుకు రెడీ అవుతున్నారు. 

వేధింపులు ఎక్కువయ్యాయి..

ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ తనను జైల్లో హింసిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తనకు ఏమైనా అయితే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ దే బాధ్యతని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. తన పార్టీ సభ్యులకూ ఇదే విషయాన్ని చెప్పానని చెప్పారు. తనదే కాక తన భార్య బుష్రా బీబీదీ ఇదే పరిస్థితి అని చెప్పారు. ఆమె జైలు గదిలో టీవీ కూడా బంద్ చేశారు. జైల్లో తన మీద కూడా వేధింపులు ఎక్కువయ్యాయని ఇమ్రాన్ ఖాన్ చెబుతున్నారు. తమ ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదుల కన్నా తమ పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఆజ్ఞల ప్రకారమే ఇదంతా జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. నా భార్యను లక్ష్యంగా చేసుకుని తనపై ఒత్తిడి తీసుకురావడమే ఆయన ఉద్దేశమన్నారు. జీవితాంతం జైల్లో గడిపేందుకు సిద్ధమే.. కానీ, నిరంకుశత్వం, అణచివేత ముందు తలొగ్గే ప్రసక్తే లేదు. దేశ ప్రజలకూ ఇదే విషయం చెబుతున్నానని..నిరసనలుకు సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. 

Also Read: Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. స్విచ్ లలో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా

Advertisment
Advertisment
తాజా కథనాలు