/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
అహ్మదాబాద్ లో కూలిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంధన స్విచ్ లు ఒక దాని తర్వాత ఒకటి సెకన్ పాటూ స్విచ్ ఆఫ్ అయ్యాయని ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. దీంతో బోయింగ్ 787, 737 విమాన ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సోమవారం అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది. ఈ ఆర్డర్ తో ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాలన్నింటినీ తనిఖీలు చేయించింది. వీటిల్లో ఎటువంటి లోపం బయటపడలేదని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాలను థ్రాటిల్ కంట్రోల్ మాడ్యూల్ తో భర్తీ చేశామని, ఇందులో FCS ఒక భాగమని కూడా ఆ అధికారి తెలిపారు.
ఇంధన స్విచ్ లు కటాఫ్ అవడం వల్లనే..
వారం రోజుల క్రితం అహ్మదాబాద్ విమాన ప్రమాదం మీద ఏఏఐబీ ప్రాథమిక దర్యాప్తును కూడా ఇచ్చింది. ప్రమాదం తర్వాత ఫోటోలు, వీడియోలు, బ్లాక్ బాక్స్ తదితర వాటిని పరిశీలించాక దీనిపై ప్రాథమిక నివేదికను సమర్పించింది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్ లు సెకన్ పాటూ ఆగిపోవడమే యాక్సిడెంట్ కు కారణమని తేల్చింది. మొత్తం 15 పేజీల నివేదికను ఏఏఐబీ సమర్పించింది. రెండు ఇంజిన్లూ ఒకేసారి ఆగిపోయాయని చెప్పింది. కాక్ పిట్ లో పైలెట్ల వాయిస్ రికార్డ్ ఆధారంగా దీన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇంజిన్లను ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలెట్...రెండో పైలెట్ ను అడిగారని తెలుస్తోంది. అయితే మొదటి పైలెట్ తాను స్విఛాఫ్ చేయలేదని చెప్పారని...తర్వాత మేడే కాల్ ఇచ్చారని నివేదికలో రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండు ఇంజిన్లు కటాఫ్ అయినా విమానం అవసరమైన ఎత్తుకు ఎగరగలిగింది. తర్వాత రెండు ఇంజిన్లలో ఒకటి వెంటనే ఆన్ అయినా రెండో దానిని మాత్రం స్విఛాన్ చేయలేకపోయారు.