Israel Prime Minsiter Netanyahu:
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మీద ఐసీసీ చర్యలకు సిద్ధమైంది. నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్ గల్లాంట్‌పైనా ఇవి జారీ అయ్యాయి. గాజాలో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై.. ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఐక్యరాజ్యసమితి, ఇతర దేశాలు ఎప్పటి నుంచో యుద్ధాన్ని ఆపమని కోరుతున్నాయి. అయినా కూడా ఇజ్రాయెల్ అందరి మాటను పెడచెవిన పెడుతోంది. హమాస్, హెజ్బెల్లాలు అంతమొందించే వరకూ యుద్ధాన్ని ఆపేది లేదని చెబుతోంది. దాని కోసం గాజా, లెబనాన్‌ల మీద అటాక్ చేస్తూ వేలమంది ప్రాణాలు తీసింది.
ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?
44వేలమందికి పైనే..
మరోవైపు గాజాలో ఇప్పటివరకు 44 వేలకు పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా మంత్రిత్వశాఖ తెలిపింది. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు గాజాలో పౌరుల భవిష్యత్తులకు శాపంగా మారాయి. దాడులతో అక్కడ ప్రజలు చనిపోతుండడమే కాకుండా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 13 నెలలుగా కొనసాగుతున్న ఈ భీకర పోరులో వేలాది మంది గాజా వాసులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాటూ సరైన తిండి, వసతులు లేక ప్రజలు అల్లల్లాడుతున్నారు. బాంబుల వల్ల కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే...తిండి లేక మరికొందరు చనిపోతున్నారు. ఇలా ఇప్పటివరకు 44 వేల మందికి పైగా చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
Also Read: Russia: ఉక్రెయిన్‌పై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగం
ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!
ఇది కూడా చూడండి: ఓటీటీలో ప్రశాంత్ నీల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. మీరు చూశారా..?