Ukraine Russia War : ఉక్రెయిన్‌పై రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ ముదురుతోంది. మొన్న ఇఉక్రెయిన్ ఇతర దేశాల ఆయుధాలను వాడిందని రష్యా ఆరోపించింది. నేడు రష్యానే మొదటిసారి ఖడాంతర క్షిపణితో ఉక్రెయిన్ మీద దాడి చేసింది. 

New Update
11

Russia- Ukarain War: 

రష్యా మొదటిసారిగా యుద్ధంలో దీర్ఘశ్రేణి ఆయుధాన్ని వాడింది. ఉక్రెయిన్ మీద ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది.  ఈ విషయాన్ని క్లీవ్ ఎయిర్ ఫోర్ప్ ధృవీకరించింది. అయితే ఏ రకమైన క్షిపణిని ప్రయోగించారో కచ్చితంగా చెప్పలేదు. దీంతోపాటు ఎక్స్‌-47ఎం2 కింజల్‌ బాలిస్టిక్‌ క్షిపణిని కూడా ప్రయోగించినట్లు తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్‌ ఆరోపణలపై స్పందించేందుకు రష్యా నిరాకరించింది. దీనిపై చెప్పేందుకు ఏమీ లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అన్నారు. ఇది తమ సైనికులను అడిగాల్సిన ప్రశ్న అని ఆయన చెప్పారు. 

ఇది కూడా చూడండి:  AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?

రష్యా దగ్గర ఖండాంతర క్షిపణిలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 1957లో సోవియట్ యనియన్ దీనిని మొదటిసారిగా ప్రయోగించింది. ఆ తర్వాత అమెరికా కూడా తమ దగ్గర ఉన్న క్షిపణిను విజయవంతంగా పరీక్షించింది. ఖండాంతర క్షిపణిని దీర్ఘశ్రేణి ఆయుధం కింద పరిగణిస్తారు. ఇది కనీసం 5,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు.  భూగర్భంలో ఏర్పాటు చేసిన సిలోస్‌ నుంచి లేదా మొబైల్‌ వాహనాల పై నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఘన ఇంధన ఐసీబీఎంను అత్యంత ప్రమాదకారి. ఇక  3,000 కిలోమీటర్ల  నుంచి 5,000 కి.మీ. లక్ష్యాలను ఛేదించే వాటిని మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులుగా పరిగణిస్తారు. 

ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్‌ వైరల్‌!

అటు ఉక్రెయిన్ కూడా ఇవే ఆయుధాలను ప్రయోగించేందుకు సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ దీనికి అనుమతినిచ్చింది. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. వెంటనే రష్యా కూడా అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు వీలుగా నిన్న అధ్యక్షుడు పుతిన్ ఆమోదించారు. దానికి సంబంధించిన పత్రాల మీదన సంతకాలు చేశారు. అప్పటి నుంచే రష్యా భారీగా దాడి చేయవచ్చని చెబుతున్నారు. అన్నట్టుగానే ఈరోజు ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. 

Also Read: Adani: ఆరోపణలు నిరాధారం–అదానీ గ్రూప్

ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు