Facebook: ఫేస్‌ బుక్‌కు  భారీ షాక్‌!

ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాకు యూరోపియన్‌ యూనియన్‌ నియంత్రణాధికార సంస్థ ఊహించని షాకిచ్చింది. దాదాపు 800 మిలియన్‌ యూరోల అపరాధ రుసుమును విధించింది.ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ యాడ్స్‌ వ్యాపారంలో పోటీ వ్యతిరేక ధోరణులను అవలంబించిందని సంస్థ ఆరోపించింది.

New Update
fb

Face Book:ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా పై యూరోపియన్‌ యూనియన్‌ నియంత్రణాధికార సంస్థ దాదాపు 800 మిలియన్‌ యూరోల అపరాధ రుసుమును విధించింది. మెటా తన మార్కెట్‌ గుత్తాధిపత్యాన్ని  వినియోగించుకుని ఆన్‌లైన్‌ క్లాసిఫైడ్‌ యాడ్స్‌ వ్యాపారంలో పోటీ వ్యతిరేక ధోరణులను అవలంబించిందని యూరోపియన్‌ కమిషన్‌ ఈ సందర్భంగా పేర్కొంది.

Also Read: AP Rains: అల్పపీడనం ప్రభావం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

దీర్ఘకాలం పాటు కొనసాగిన దర్యాప్తు అనంతంర 797. 92 మి. యూరోల పెనాల్టీని విధించినట్లు వివరించింది. ఫేస్‌ బుక్‌ వినియోగదార్లకు అవసరం ఉన్నా..లేకున్నా..ఆటోమేటిక్‌ గా వ్యాపార ప్రకటనలను జొప్పించిందని ఆరోపించింది.

Also Read: AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!

అలాగే ఇతర పోటీదార్ల యాడ్‌ సంబంధిత సమాచారాన్ని ఉపయోగించుకుని, సహేతుకం కాని ధోరణులను అవలంబించినట్లు పేర్కొంది. కాగా పోటీదార్లకు కానీ, వినియోగదార్లకు కానీ పోటీ పరంగా హాని కలిగించినట్లు నిరూపించడంలో కమిషన్‌ విఫలమైందని, ఈ నిర్ణయం పై అప్పీలుకు వెళ్లనున్నట్లు మెటా తెలిపింది.

Also Read: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం!

వాట్సాప్‌ను నిషేధించాలని సుప్రీంకోర్టులో

వాట్సాప్‌ను నిషేధించాలని కోరుతో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యం(PIL) దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వాట్సాప్ పాటించడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి పిల్ వేశాడు. అయితే దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దాన్ని తోసిపుచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.    

Also Read: Heart Attack: ఈ ఐదు పనులు చేస్తే జీవితాంతం గుండెపోటు రాదు

 యూరప్‌కి ఒకలా మనకి ఒకలా ?

 ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ అక్కడి హైకోర్టును ఆశ్రయించాడు. వాట్సాప్ సంస్థ ఐటీ నింబంధనలు -2021 పాటించడం లేదని ఆరోపించాడు. యూజర్ వైపు మార్పులు చేసే ఆస్కారం ఉందని.. అలాగే సందేశం మూలాలు కనుక్కోవడం కూడా అసాధ్యమని పేర్కొన్నాడు. అయితే వాట్సాప్ యూరప్‌లో వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తోందని.. కానీ ఇండియాలో మాత్రం ఇక్కడి చట్టాలు పాటించడం లేదని ఆరోపించాడు.

అయితే ఈ పిటిషన్‌పై విచారించిన కేరళ హైకోర్టు.. ఇది తొందరపాటు చర్యగా పేర్కొంది. అతడి పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఆ వ్యక్తి చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పౌరుల ప్రాథమిక హక్కులను వాట్సాప్ ఉల్లంఘిస్తోందని.. జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా మారిందని ఆరోపణలు చేశాడు. సాంకేతికతను మార్చకుండా ప్రభుత్వానికి సహకరించకుంటే దేశంలో వాట్సాప్ కార్యకలాపాలను నిషేధించాలని సూచించాడు.

కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటించని అనేక మొబైల్ యాప్‌లు, వైబ్‌సైట్లు దేశంలో నిషేధించబడ్డాయని గుర్తుచేశారు. అయితే ఈ పిల్‌ను పరిశీలించిన జస్టిస్ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం దాన్ని కొట్టివేసింది. కేరళ వ్యక్తి దాఖలు చేసిన ఈ పిల్‌ను స్వీకరించడానికి మొగ్గు చూపడం లేదని పేర్కొంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు