AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..! తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది. By Bhavana 15 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Vizag:తనను ప్రేమించడం లేదని కక్షగట్టిన ఓ ప్రేమోన్మాది..జమ్మూ నుంచి విశాఖకు వచ్చి మరీ యువతి పై దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది. గాజువాక బాలచెరువు కాలనీలో గురువారం జరిగిన ఈ దారుణం పై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..డిగ్రీ పూర్తి చేసిన మేఘన (21) అనే యువతి ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా గతేడాది రాజస్థాన్ లోని మౌంట్ అబుకు వెళ్లింది. Also Read: SA:గనిలో చిక్కుకున్న 4 వేల మంది చిన్నారులు..సాయం చేయనంటున్న ప్రభుత్వం! అక్కడ జ్వరం రావడంతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.అదే సమయంలో జమ్మూ లోని ఉద్దంపూర్ కు చెందిన నీరజ్ శర్మ (28) అనే యువకుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...మేఘనతో పరిచయం పెంచుకున్నాడు. Also Read: Nita Ambani: 50వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు–రిలయెన్స్ ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చిన మేఘనకు నీరజ్ తరచూ ఫోన్ చేస్తూ ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ ఉండేవాడు. అంతేకాకుండా అతని ఫొటోలు కూడా పంపుతుండేవాడు. తనకు ఇలాంటివి ఇష్టం లేదని చెప్పినా, తన పాత వీడియోలు, అశ్లీల చిత్రాలు పంపించి, వేధించాడు. Also Read: Caste Census: కులగణనతో సంక్షేమ పథకాలు తొలగించం–రేవంత్ రెడ్డి మేఘన తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు గతంలో న్యూపోర్టు పోలీసులకు సైబర్ క్రైం విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోన్లో నీరజ్ వర్మను హెచ్చరించారు. మేఘన తల్లిదండ్రులు గురువారం ఇంట్లో లేని సమయం చూసుకొని , హెల్మెట్ ధరించి వచ్చిన నీరజ్ నేరుగా ఆమె గదిలోకి వెళ్లాడు. Also Read: TS:హోమ్ గార్డులుగా ట్రాన్స్ జెండర్లు..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన రెండు రోజుల క్రితమే.. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో దాడికి దిగాడు. తల, భుజం, చేతుల పై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె కేకలు విని పక్కింట్లో ఉంటున్న సాయి కృష్ణ అనే యువకుడు రాగా, అతని పైనా దాడికి దిగాడు. నిందితుడు పారిపోతుండగా..అదే ప్రాంతానికి చెందిన హోంగార్డు శ్రీను నిందితున్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను దొరకలేదు. బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, తల పై 31 కుట్లు పడ్డాయి. చేతి చూపుడు వేలు తెగిపోయింది. రెండు మోచేతులు కూడా ఛిద్రమయ్యాయి. జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంతి, హార్బర్ ఏసీపీ కాళిదాస్ న్యూపోర్టు సీఐ దాలిబాబు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. నీరజ్ రెండు రోజుల క్రితమే జమ్మూ నుంచి ఇక్కడికి వచ్చి రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. #vizag-crime #woman #Man Attacked #attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి