/rtv/media/media_files/2026/03/03/mossad-spies-2026-03-03-14-00-09.jpg)
How Mossad Spies, Traffic Cameras Sealed Khamenei's Fate, Know details
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. అసలు ఖమేనీని అంత కచ్చితంగా టార్గెట్ చేసి ఎలా హతమార్చాయనే దానిపై ఇప్పటికీ సందేహం నెలకొంది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఫైనాన్షిల్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్ చాలా ఏళ్లుగా టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరా వ్యవస్థను హ్యక్ చేసింది. మొబైల్ నెట్‌వర్క్ యాక్సెస్ కూడా పొందింది.
Also Read: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలా ఖమేనీ, అతని వెంట ఉండే భద్రతా సిబ్బంది కదలికలను పర్యవేక్షించాయి. టెహ్రాన్‌లో ఉన్న చాలావరకు ట్రాఫిక్ కెమెరాలు ఇజ్రాయెల్ నిఘాలో ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫుటేజ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి విదేశాలకు పంపించారు. ఇది ఖమేనీ కదలికలకు సంబంధించి పూర్తి నమూనాను సృష్టించారు. దీనిద్వారా ఆయన ఎప్పుడు, ఎక్కడికి వెళ్లారు ? ఏ మార్గంలో వెళ్లారు ? ఎవరితో ఉన్నారనేది ప్రతీది కూడా రికార్డు చేయగలిగారు. ఇజ్రాయెల్ నిఘా విభాగమైన మొసాద్ ఈ ఆపరేషన్‌లో కీలకంగా పనిచేసింది.
ఖమేనీపై దాడి చేయడానికి కొన్ని గంటల ముందు, ఆయన కార్యాలయం సమీపంలోని మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆయన భద్రతా సిబ్బందికి ఎలాంటి హెచ్చరికలు అందకపోవడంతో అమెరికా, ఇజ్రాయెల్ విజయవంతంగా దాడులు చేయగలిగాయి.
Also read: హర్మూజ్ జలసంధి మూసివేత.. ఇరాన్ సంచలన నిర్ణయం
నగరాల్లో ఏర్పాటు చేసే సీసీటీవీ కెమెరాలు కేవలం ట్రాఫిక్ నియంత్రణ కోసమే కాదు. వాటిని నిఘా సాధానాలుగా కూడా వినియోగిస్తారు. ఇజ్రాయెల్ ఇలాంటి కార్యాచరణ ప్రణాళికనే రూపొందించింది. తద్వారా ఖమేనీ సంబంధించిన కదలికలు, భద్రతను విశ్లేషించాయి. ప్రస్తుతం దేశాల మధ్య యుద్ధాలు భూమిపై లేదా ఆకాశంలో మాత్రమే జరగవని బలమైన సైబర్ సామర్థ్యాలు గల దేశాలు టెక్నాలజీతో కూడా శత్రుదేశాలను దెబ్బకొట్టగలవని నిపుణులు అంటున్నారు. మౌలిక సదుపాయాలు కూడా నిఘా సాధనంగా మారితే అదే కొత్త రకమైన యుద్ధమని చెబుతున్నారు.
Follow Us