Trump: మీకెంత మంది భార్యలు..సిరియా అధ్యక్షుడికి ట్రంప్ ప్రశ్న

రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బేటీ అయ్యారు. ఈ సందర్భంగా సిరియా అధ్యక్షుడిని మీ కెంత మంది భార్యలు అంటూ ట్రంప్ ప్రశ్నించిన వీడియో...ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
shara

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అస్సలు మొహమాటం లేని వ్యక్తి. మనసులో ఏముంటే అది ముఖం మీదనేమాట్లాడేస్తారు. ఇదే పనిని తాజాగా సిరియా అధ్యక్షుడి విషయంలో కూడా చేశారు ట్రంప్. కొన్ని రోజుల క్రితం వైట్ హౌస్ లో సిరియా అధ్యక్షుడు అహ్మద్ ల్ షరా, ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ షరాకు ఓ పెర్ఫ్యూమ్ బాటిల్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది మీకు, మీ భార్యకు బాగుంటుందని కూడా అన్నారు. దాని తరువాత మీకు ఎంత మంది భార్యలు అంటూ అధ్యక్షుడు షరాను ట్రంప్ ప్రశ్నించారు. దానికి సిరియా అధ్యక్షుడు ఒక్కరే అని బదులివ్వగా.. నిజమేనా? నమ్మలేం అంటూట్రంప్ సందేహం వ్యక్తం చేయడంతో అక్కడంతా నవ్వులు విరబూశాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది.

మొదటి సిరియా అధ్యక్షుడు..

సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌-షరా.. మొదటిసారి అమెరికాలో పర్యటించారు. 1946లో స్వాతంత్ర్యం అనంతరం వాషింగ్టన్‌ను సందర్శించిన మొదటి సిరియా అధ్యక్షుడిగాను షరా రికార్డు సృష్టించారు. 2003లో ఇరాక్‌పై అమెరికా దండయాత్రకు ముందు అల్-ఖైదాలో చేరిన షరా.. ఇరాకీ తిరుగుబాటులో పాల్గొన్నారు. దీంతో అమెరికన్ దళాలు ఆయన్ను కొన్నేళ్లు నిర్బంధ కేంద్రంలో ఉంచాయి.

Also Read: Delhi Blast Update: ఢిల్లీ బాంబుపేలుడు కారులో లభించిన డీఎన్ఏ ఉమర్ దే..

Advertisment
తాజా కథనాలు