/rtv/media/media_files/2024/12/06/rvG3KkaPQHsJHMG8pbDg.jpg)
Trump Elon Musk Dispute
Trump Elon Musk Dispute: అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024(US Presidential Election 2024) నవంబర్ లో జరిగాయి. అంతకు ముందు మార్చిలో ఎలాన్ మస్క్ తాను ఏ అభ్యర్థికీ మద్దతు ఇవ్వనని చెప్పారు. కానీ తరువాత ఏమైందో మనసు మార్చుకుని ట్రంప్ వైపు నిలబడ్డారు. ఆయన తరుఫున బహిరంగంగా ప్రచారం కూడా చేశారు. నీళ్ళల్లా డబ్బు కూడా ఖర్చు పెట్టారు. మొత్తానికి ఎలాన్ మస్క్, ట్రంప్ కలిసి అమెరికా ప్రబతువాన్ని స్థాపించారు. తరువాత కూడా డోజ్ అనే విభాగాన్ని పెట్టి అమెరికా ఫస్ట్ అంటూ చాలా పనులు కూడా చేశారు. ట్రంప్ తర్వాత మస్క్ అమెరికాలో రెండవ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అయ్యారు. జనవరి 20న ట్రంప్ ప్రభుత్వం పని చేయడం మొదలెట్టింది. ఆరోజు బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వరుసగా ఆర్డర్లపై సంతకాలు చేశారు.
ప్రభుత్వం మొదలైన రెండో రోజునే..
అయితే జనవరి 21న ఆయన పారిస్ వాతావరణం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగడం అనే రెండు ఉత్తర్వులపై సంతకాలు పెట్టారు. కానీ ఈ రెండిటిని ఎలాన్ మస్క్ వ్యతిరేకిచారని తెలుస్తోంది. అప్పుడు వాటిపై వ్యతిరేకతను బహిరంగ పరకపోయినా...వాటితో ఏకీభవించలేదని మస్క్ సన్నిహితులు చెబుతున్నారు. 27 జనవరి 2025 ఈరోజున యూరోపియన్ యూనియన్ పై 25 శాతం సుంకం(25 Percent Tariff on European Union) విధిస్తానని ట్రంప్ ప్రకటించారు. దీనిని ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఉత్తర్వు ప్రభుత్వ సామర్థ్యానికి విరుద్ధమని అన్నారు. దీని వలన ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతుందని...తన టెస్లా(Tesla), ఎక్స్(X) కంపెనీలకు హానికరమని మస్క్ అన్నారు. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెప్పారు.
Also Read: ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ.. పీసీసీ చీఫ్ మహేష్ సంచలన ప్రకటన!
18 ఫిబ్రవరి 2025
మస్క్ DOGE కి బాస్ కాదని, కేవలం సలహాదారుడని వైట్ హౌస్ స్పష్టం చేసింది. DOGE పని సలహా ఇవ్వడమేనని, నిర్ణయాలు మంత్రులు తీసుకుంటారని స్పష్టం చేశారు. దీనిపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు తనకు అవమానకరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాని చెబుతున్నారు.
6 మార్చి 2025
ట్రంప్ అన్ని దేశాలతో పాటూ భారతదేశంపై సుంకాలు వేశారు. దీనిని ఎలాన్ మస్క్ వ్యతిరేకించారు. ఇలా చేస్తే భారతదేశంతో వ్యాపారం చేయడం కష్టమని అన్నారు. భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని నిర్మించి స్టార్‌లింక్‌ను ప్రారంభించాలని యోచిస్తున్న మస్క్, నష్టాలను చవిచూడాల్సి వస్తుందని చెప్పారు.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లు
మస్క్ ఈ బిల్లును చాలా ఖరీదైనదిగా, DOGE లక్ష్యాలకు విరుద్ధమైనదిగా అభివర్ణించారు. ఈ బిల్లు ప్రభుత్వ ఖర్చులను తగ్గించదు సరికదా..లోను పెంచుతుందని అన్నారు. డోజ్ కు ఇది పూర్తిగా విరుద్ధమంటూ బిగ్ బ్యూటి ఫుల్ బిల్లుపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. CBSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ, "ఈ బిల్లు అనవసరమైన ఖర్చులతో నిండి ఉంది. దీని వలన టెస్లాకు కూడా హానికరం, ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పన్ను క్రెడిట్‌లను తొలగించాలని ప్రతిపాదించింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ బిల్లు గురించి సెనేట్ లో మంత్రులందరూ అంగీకారం తెలపడం బుద్ధిలేని తనమని వ్యాఖ్యలు చేశారు.
Also Read: వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు
మే 29, 2025
మస్క్ రాజీనామా ఇదే రోజు ఎలాన్ మస్క్ తన ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకుననారు. అయితే ట్రంప్ కు దగ్గరగానే ఉంటానని..సలహాలు ఇస్తానని తెలిపారు. మస్క్ వెళిపోతున్నప్పుడు ట్రంప్ కూడా గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు. కానీ వెళ్ళిన తర్వాత నుంచీ మస్క్ అమెరికా అధ్యక్షుడిపై దాడి మొదలుపెట్టారు. నేనే లేకపోతే ట్రంప్ గవర్నమెంట్ లేదని..మరి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వీటికి ట్రంప్ రియాక్ట్ అయ్యారు. దీంతో చిలిక చిలిక గాలి వాన అయి ఇప్పుడు ఇద్దరూ పూర్తిగా విడిపోతారు అనే స్టేజ్ కు వచ్చేశారు.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్