/rtv/media/media_files/2025/07/17/subhanshu-2025-07-17-08-22-12.jpg)
Shubhanshu Shukla reunited with his wife, Kamna and son Kiash after his 18-day mission aboard the ISS
అంతరిక్ష ప్రయాణం అద్భుతం. అయితే అంతకు మించి కుటుంబసభ్యులను ఇన్ని రోజుల తర్వాత కలుసుకోవడం ఇంకా అద్భుతంగా ఉందని శుభాంశు శుక్లా అన్నారు. అంతరిక్షం నుంచి భూమి మీదకు తిరిగి వచ్చిన శుభాంశు శుక్లా హూస్టన్‌లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైశ్‌ను కలిసి ఆనందంతో హత్తుకున్నారు. స్పేస్ లోకి వెళ్ళక ముందు రెండు నెలలు క్వారంటైన్ లో గడిపాను. ఆ సమయంలో దూరం నుంచే కుటుంబాన్ని చూశాను. ఇప్పుడు తిరిగి వచ్చాక ఫ్యామిలీని చూస్తుంటే..నిజంగా ఇంటికి వచ్చినట్లనిపించిందని శుభాంశు అన్నారు. కొన్నిసార్లు మనం బిజీగా ఉంటాం. మన జీవితాల్లోని వ్యక్తులు ఎంత ముఖ్యమైన వారో మర్చిపోతుంటాము. ఈరోజు నాకు జీవితంలో అత్యంత ముఖ్యమైన , ఇష్టమైన వారిని కలుసుకున్నానని చెప్పారు. తన కుటుంబాన్ని కలిసిన ఫోటోలను శుక్లా ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇవి వైరల్ గా మారాయి.
అనేక ప్రయోగాల తర్వాత క్షేమంగా తిరిగి వచ్చి..
యాక్సియం-4 మిషన్ లో భాగంగా పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ)లతో కలిసి ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన శుభాంశు.. 18 రోజుల తర్వాత భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు భూమిపైకి సురక్షితంగా చేరారు. శుభాంశు శుక్లా బృందం జూన్ 25న అమెరికాలోని నాసా నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. 28 గంటల ప్రయాణం తర్వాత వారు ISSలోకి చేరుకున్నారు. అందులో శుక్లా నేతృత్వంలోని ఈ టీమ్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించడం విశేషం. శుభాంశుతో సహా నలుగురు వ్యోమగాములు ISSలో 18 రోజులు గడిపారు. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టం గురించి శుభాంశు శుక్లా అధ్యయనం చేశారు. అంతేకాదు మానవ జీర్ణవ్యవస్థ అంతరిక్షంలో ఎలా పనిచేస్తుందనే దానిపై ఆయన భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ వీడియోను కూడా రూపొందించారు.
Also Read: Gaza: గాజాలో దయనీయ పరిస్థితులు..సహాయ కేంద్రంలో తొక్కిసలాట..20 మంది మృతి