అది ఒక ఐలాండ్. అడుగుడుగునా బుసలు కొట్టే అతిపెద్ద పాములు. కల్లు మూసారో ఖతం చేసేస్తాయి. అది ఎక్కడో కాదు గువామ్ ఐలాండ్. ఫిలిప్పీన్స్ నుంచి దాదాపు 2,492 కి.మీ దూరంలో ఉంది. చుట్టుపక్కల ఉన్న ఐలాండ్‌లతో పోలీస్తే గువామ్ ఐలాండ్‌లో భయంకరమైన పాములు విపరీతంగా ఉన్నాయి. ఈ ఐలాండ్ పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న పచ్చని ప్రాంతం.
ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో గందరగోళం.. లగచర్ల ఘటనపై ఒక్కో నేతది ఒక్కో మాట!
20 లక్షలకు పైగా పాములు
ఈ దీవిలో దాదాపు 20 లక్షలకు పైగా పాములు ఉండే ఉంటాయి. ఈ సంఖ్య చాలా తక్కువనే తెలుస్తోంది. నిజానికి అక్కడ పాములు సంఖ్య ఎంతనేది ఎవ్వరికీ తెలియదు. ఈ పాములు దేన్ని వదిలిపెట్టవు. ఎలుకలు, బల్లులు, పురుగులు, జంతువులు సహా కొన్నిసార్లు మనుషులను సైతం ఇవి మింగేయగలవు. అంతేకాదు వాటికి ఆకలి వేసిందంటే.. ఒకదానికొకటి కూడా తినేస్తాయి.
ఇక ఈ పాములు ఆ దీవిలో ఉన్న ఎన్నో రకాల పక్షి జాతులను నామరూపాలు లేకుండా చేశాయి. ఈ దీవి జీవవైవిధ్యానికి చిరునామాగా ఉండేది. ఎన్నో రకాల పక్షులు, జంతువులు ఈ దీవిలో కలకలలాడేవి. కిచకిచమనే శబ్దాలు చేస్తూ ఉండేవి. వింత వింత శబ్దాలతో ఒకప్పుడు అత్యంత ధ్వని పూరిత ప్రాంతంగా గువామ్ ఐలాండ్ ఉండేది. కానీ ఈ ఐలాండ్‌లోకి పాములు ఎప్పుడైతే వచ్చాయో.. అప్పటి నుంచి పక్షులు నామారూపాలు లేకుండా పోయాయి. ఇప్పుడు ఆ ఐలాండ్ పక్షులు లేని, భయంకర నిశ్వబ్ద ప్రాంతంగా మిగిలిపోయింది.
Also Read : బుమ్రా వికెట్‌పై 100 డాలర్ల బెట్.. బీసీసీఐ పోస్ట్ వైరల్!
ఓ సారి ఆ ఐలాండ్‌కి వెళ్లిన కొందరు అక్కడ జరిగిన సంఘటనను చెప్పుకొచ్చారు. ఐదేళ్ల క్రితం గువామ్ ఐలాండ్‌లో హాల్డ్రీ రోగర్స్ గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే గువామ్ ఐలాండ్‌కు చేరుకున్నారు. అక్కడ డిన్నర్ కోసం ఒక పందిని కాలుస్తూ ఉన్నారు. అది కాలుతున్న సమయంలో వారు అలా కాసేపు బయటకి వెళ్లి కబుర్లు చెప్పుకున్నారు. ఇక వారు తిరుగొచ్చేసరికి గోదుమరంగులో ఉన్న ఒక పాము అతి పెద్ద నోరు, మిలమిల మెరిసే కళ్లతో వారికి కనిపించింది.
Also Read : వదిన అక్రమ సంబంధానికి మరదలు బలి.. ఇదో దుర్మార్గపు క్రైమ్ కథ!
ఇది కూడా చదవండి: లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకోం.. రేవంత్ కు మావోయిస్టుల సంచలన లేఖ!
ఆ పందిని చుట్టుకుని ఆ గోదుమరంగు గల పాము అమాంతంగా మింగేసింద అని రోగర్స్ తెలిపారు. దాదాపు 22 ఏళ్లుగా గువామ్ జీవావరణంపై అధ్యయనం చేస్తున్నారు. అయితే ఆ పాముని చూసి వారు షాక్ అయినట్లు తెలిపారు. ఆ పాము ఈ ప్రాంతానికి చెందినది కాదని.. గ్రహాంతర పాము అని (వేరే చోట నుంచి ఈ ప్రాంతానికి వచ్చింది) అని పేర్కొన్నారు. అది కార్గోషిప్‌లోకి దొంగచాటుగా చేరి 1940ల్లో గువామ్‌కు వచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.
ఆ పాము ఈ ఐలాండ్‌కు రాకముందు ఎన్నో పక్షులు ఉండేవని.. అవి వచ్చాక నాలుగు దశాబ్దా్లో అడవుల్లోని పక్షులను ఖాళీ చేసేశాయని తెలిపారు. మొత్తం 12 పక్షి జాతులు ఉండేవని.. అందులో దాదాపు 10 పక్షి జాతులు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. మిగిలిన రెండు జాతులు ఏవో గుహలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయని తెలిపారు.