రాజకీయాల్లోకి కంగన.. ఆ పార్టీనుంచే పోటీ చేస్తుందంటూ తండ్రి క్లారిటీ
నటి కంగనా రనౌత్ రాజకీయ ప్రవేశంపై ఆమె తండ్రి అమర్ దీప్ క్లారిటీ ఇచ్చారు. కంగన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తుంది. ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేపీ హైకమాండ్ త్వరలో నిర్ణయిస్తుందని తెలిపారు.