Parliament: జర్మనీ పార్లమెంట్ రద్దు అయింది. అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2025 ఫిబ్రవరి 23న జర్మనీలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్వహణ తాత్కాలిక బాధ్యతలు ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌కు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించిన ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్.. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరిలో ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడంతో.. శుక్రవారం జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్ పార్లమెంటును రద్దు చేయగా.. ఫిబ్రవరి 23ని ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబరులో పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన విషయం తెలిసిందే. స్కోల్జ్ విశ్వాస ఓటులో ఓడిపోయాడు. నవంబర్ 6న మూడు-పార్టీల సంకీర్ణ పతనం తర్వాత మైనారిటీ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలనే వివాదంలో స్కోల్జ్ తన ఆర్థిక మంత్రిని తొలగించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: Tiger: వరంగల్‌లో పులి సంచారం.. పంట పొలాల్లోనే తిష్ట! నిజానికి అనుకున్నదానికంటే ఏడు నెలల ముందుగా అంటే ఫిబ్రవరి 23న పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని అనేక ప్రధాన పార్టీల నాయకులు అంగీకరించారు. ఇక 733 మంది సభ్యులున్న సభలో ఇటీవల ఓటింగ్ జరిగింది. స్కోల్జ్ కు అనుకూలంగా కేవలం 207, వ్యతిరేకంగా 394 మంది ఓటేశారు.116 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు.