Nepal: నేపాల్‌లో సోషల్ మీడియా యాప్స్ బ్యాన్.. రోడ్లెక్కిన 'జెన్‌ Z' యువత

నేపాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రభుత్వం వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి పలు సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడంతో అక్కడి యువత రోడ్లపైకి ఎక్కారు.

New Update
Gen Z revolution in Nepal, Anti-government protests erupt over social media curbs

Gen Z revolution in Nepal, Anti-government protests erupt over social media curbs

నేపాల్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడి ప్రభుత్వం వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి పలు సోషల్ మీడియా యాప్స్‌ను నిషేధించడంతో అక్కడి యువత రోడ్లపైకి ఎక్కారు. కేపీ షర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'జెన్‌ జెడ్ విప్లవం' అనే పేరుతో రాజధాని కాట్మాండ్‌లోని పార్లమెంటు సమీపంలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాట్మాండ్‌లో అధికారులు కర్ఫ్యూ విధించారు.  

సెప్టెంబర్ 4న నేపాల్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌, ఎక్స్‌, వాట్సాప్, యూట్యూబ్‌తో సహా 26 యాప్స్‌ను నిషేధించింది. ఆ యాప్స్‌ అక్కడి ఐటీ చట్టాలను పాటించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఆందోళనకారులు మాత్రం ప్రజల గొంతుకను అణిచివేసే చర్యగా భావిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలా సోషల్ మీడియా యాప్స్‌ను బ్లాక్‌ చేయడంతో ఆందోళనకారులు టిక్‌టాక్, రెడ్డిట్‌ లాంటి వాటిని వినియోగించాల్సిన పరిస్థితి వచ్చింది.మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని కేపీ శర్మ ఒలీ సమర్థించారు. 

Advertisment
తాజా కథనాలు