DOGE: ఎలాన్ మస్క్ తర్వాత డోజ్ పరిస్థితి ఏంటి? మూతబడుతుందా?

అమెరికా ప్రభుత్వ బాధ్యతలకు ఎలాన్ మస్క్ టాటా బైబై చెప్పేశారు.  డోజ్ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు డోజ్ పరిస్థితి ఏంటి? ట్రంప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుని..సమూల మార్పులు చేపట్టిన డోజ్ ను ఏం చేయనున్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

New Update
 Elon Musk and Trump

Elon Musk and Trump

అధికారంలోకి రాకముందు నుంచే అధ్యక్షుడు ట్రంప్ , ఎలాన్ మస్క్  డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ గురించి గొప్పగా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఈ విభాగం అమెరికాలోని ఒక వర్గం అతలాకుతలం అయ్యేంతగా తొలగింపులు చేపట్టింది. దీనికి ఎలాన్ మస్కే ప్రధాన సారధిగా ఉండి నడిపించారు. ప్రభుత్వానికి రెండు ట్రిలియన్లను సేవ్ చేశారు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించి..బోలెడంత డబ్బును మిగుల్చారు. జూలై 2026 నాటికి విస్తృత సంస్కరణలు చేపడతామని చెప్పారు. దీని వలన ఎలాన్ మస్క్ చాలా విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. తన సొంత టెస్లా షోరూంలోనే నిరసనలు వ్యక్తం అయ్యాయి. 

డోజ్ ఇక మీదట పని చేస్తుందా?

ఇప్పుడు డోజ్ ను ఇన్నాళ్ళు నడిపించిన ఎలాన్ మస్క్ ఇప్పుడు దాన్ని వదిలేశారు. ఈరోజే ఆఖరి రోజు. దీని తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సలహాలు ఇస్తానని చెప్పినా..డోజ్ గురించి మాత్రం మస్క్ మాట్లాడలేదు. దీంతో ఇప్పుడు దానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే ప్రశ్న తలెత్తుతుంది. జూలై 4, 2026 వరకు డోజ్ పనిచేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ మస్క్ నిష్క్రమణ తర్వాత, తదుపరి చీఫ్ ఎవరు అనే దానిపై అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. క్యాబినెట్ కార్యదర్శికి అప్పగిస్తారని ఊహాగానాలు నడుస్తున్నా..సమాచారం మాత్రం లేదు. 

కానీ డోజ్ విషయంలో రాజకీయ నిపుణులు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాన్ మస్క్ తరువాత దీన్ని నిర్వహించడం కష్టమేనని చెబుతున్నారు. డోజ్ అనేది గతం అని మాట్లాడుతున్నారు. ఈ విభాగం పని ఇక ముగిసిందని చెబుతున్నారు. ఇప్పటికే డోజ్ చేయవలసిన పనులన్నీ పూర్తి చేసింది. ఇక మీదట ఈ విభాగం చేయడానికి కూడా ఏమీ లేదని అంటున్నారు. దానికి తోడు ఎలాన్ మస్క్ కూడా వెళిపోతుండడంతో దాని కథ ముగిసినట్లే అంటున్నారు. 

Also Read: Big Diplomatic Win: భారత్ దౌత్యం ఫలించింది..పాక్ గురించి తెలుసుకున్నామన్న కొలంబియా

Advertisment
తాజా కథనాలు