/rtv/media/media_files/2026/02/03/trump-2026-02-03-14-44-54.jpg)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్(trump india tariffs) ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. నిన్న రాత్రి ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాను ఈ నిర్ణయం తీసుకోవడం కేవలం వ్యాపారం కోసమే కాదని, భారత్ పట్ల, మోదీ పట్ల ఉన్న గౌరవం, స్నేహం కోసమేనని ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుకున్న బలమైన కారణాలు ఎంటో ఇప్పుడు చూద్దాం.
రష్యా నుంచి చమురు కొనడం ఆపివేసి, అమెరికా, వెనిజులా నుండి దిగుమతి చేసుకునేందుకు భారత్ అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి సహాయపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే రష్యా నుంచి చమురు కొనడం అపేసిన విషయాన్ని మాత్రం భారత్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read : ఆస్ట్రేలియాలో దారుణం.. మహాత్మా గాంధీ విగ్రహాన్ని కోసుకుని ఎత్తుకెళ్లారు!
అమెరికాను ఆలోచనలో పడేసింది.
యూరోపియన్ యూనియన్ తో భారత్ కుదుర్చుకున్న మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అమెరికాను ఆలోచనలో పడేసింది. 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఒప్పందం కుదరడం, భారత్ తన దారి తాను చూసుకుంటోందన్న సంకేతాలను వాషింగ్టన్‌కు పంపింది. ఫలితంగా, భారత్‌ను దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ తమకు కాకుండా యూరప్‌కు దగ్గరవుతోందన్న భయం ట్రంప్‌ను చర్చల మేజా వద్దకు రప్పించిందని నిపుణులు అంటున్నారు.
ప్రముఖ అంతర్జాతీయ నిపుణుడు ఇయాన్ బ్రెమ్మర్ అభిప్రాయం ప్రకారం.. అమెరికా శక్తివంతమైన దేశమే కావచ్చు కానీ, వ్యక్తిగతంగా ట్రంప్ కంటే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ బలమైన స్థితిలో ఉన్నారు. "ట్రంప్ ప్రజాదరణ తగ్గిపోతోంది, కానీ మోదీ 10 ఏళ్లుగా అధికారంలో ఉంటూ ఇంకా బలపడుతున్నారు. అందుకే మోదీ నిర్ణయాలకు ప్రపంచ వేదికపై ఎక్కువ విలువ ఉంది" అని బ్రెమ్మర్ పేర్కొన్నారు.
అమెరికా మాత్రమే కాదు, అగ్రరాజ్యాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కెనడా ప్రధాని మార్క్ కార్నీ త్వరలోనే భారత్ రానున్నారు. అమెరికాపై ఆధారపడటం తగ్గించి, భారత్‌తో ఇంధనం, యురేనియం (సుమారు రూ. 17 వేల కోట్ల ఒప్పందం) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో కీలక ఒప్పందాలు చేసుకోబోతున్నారు.
Also Read : షేక్ హసీనాకు బిగ్‌షాక్.. పదేళ్లు జైలుశిక్ష
Follow Us