Danish Kaneria: ఉగ్రదాడిలో ప్రమేయం లేకపోతే..పాక్ ఎందుకు ఉలికిపడుతోంది..డానిష్ కనేరియా

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో సంబంధం లేనప్పుడు పాక్ ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతోందని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రశ్నించారు. దీనిని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదని అడిగారు. 

New Update
pakistna ex cricketer

Danish Kaneria

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అన్ని దేశాల నేతలూ స్పందించారు. ఒక్క పాకిస్తాన్ ప్రధాని తప్ప. అంతేకాదు ఇదంతా భారత్ చేసిన తప్పులే అంటూ ఆ దేశ రక్షణ మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడారు. దానికి తోడు పాక్ ప్రభుత్వం తన రక్షణ బలగాలను అలెర్ట్ చేసింది. భారత సరిహద్దు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు పాక్ పై భారత్ కఠిన నిర్ణయాలను తీసుకుంది. అన్ని వైపుల నుంచీ దిగ్భంధనం చేసేసింది. 

మండిపడుతున్న మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా..

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్ ప్రవర్తనపై, కాశ్మీర్ ఉగ్రదాడిపై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డారు. ఉగ్రదాడిలో సంబంధం లేకుంటే ఎందుకు పాకిస్తాన్ ఉలికిపడుతోందని ప్రశ్నించారు. దాడిని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు...కనీసం దాని గురించి మాట్లాడలేదు కూడా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయనప్పుడు భారత సరిహద్దుల్లో బలగాలను ఎందుకు హై అలెర్ట్ చేశారని కనేరియా అడుగుతున్నారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నామని పాక్ ప్రభుత్వానికీ తెలుసు...అందుకే ఇవన్నీ చేస్తోంది. ఇలాంటివి చేయడానికి వారికి సిగ్గుండాలి అని డానిష్ కనేరియా మండిపడుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.  

 

today-latest-news-in-telugu | cricketer

 

Also Read:  Ind-Pak: భారత్ ప్రభుత్వ నిర్ణయాలతో పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ

Advertisment
Advertisment
తాజా కథనాలు